నేనూ నా friendu రోడ్డు మీద నడిచి వెళ్తూ వున్నాం , sudden గా ఎదురుగా ఒక share auto మా వైపు వస్తూ కనపడింది
ఆటోల కరువో ఏమో తెలీదుగానీ బాగా over loaded గా ఉంది ,
"అరేయ్ అక్కడ full passengers తో auto వస్తోంది కదా ? ముందున్న వాళ్లలో driver ఎవరో చెప్పురా " అన్నా
అసలే వాడిది detective brain ,ఫట్మని ఆరో chance కల్లా చెప్పేసాడు
నేను "correct !! ఎలా అంత fast గా ఎలా చెప్పేసావ్ ?" అన్నాను
"satireలు ఆపు !! నువ్వు ఎలా ఇంత perfect గా చెప్పావో అది చెప్పు " అని అడిగాడు
నేను గర్వం రంగరించిన వేదాంతపు నవ్వు నవ్వి
"mother's grace మచ్చా "అన్నాను
"mother's grace మచ్చా "అన్నాను
"అమ్మకీ autoకీ link ఏంటిరా " అన్నాడు
" .. ఫ్రిడ్జ్ " అన్నాను
" ఫ్రిజ్జా !! " అన్నట్టు చూసాడు
"మా ఫ్రిడ్జ్ ఇలాంటి పది share ఆటోలకి సమానం,
ఒకటిన్నర గరీబ్రధ్ రైలు తో సమానం ,
మా fridge ఒక గంగమ్మ జాతారా ,
మా fridge ఒక పురావస్తు శాఖరా " అన్నాను
"... sorry మామా ,ని తెలివి వెనక ఇంత training ఉందని తెలీదు ,hmm అంతా సద్దుకుంటుందిలే " అన్నాడు
"అంతా సద్దుకోవాలంటే ముందు మా అమ్మ fridge సర్దుకోవాలి "అన్నాను
అంతలో అమ్మ phone
"ఒరేయ్ వచేట్టప్పుడు రెండు లీటర్ల పాలు తీసుకురారా " అంది
"రెండు లీటర్లంటే ఎక్కువవుతాయేమో మ్మా "
"ఏం కావ్ ,ఒక వేళా అయితే fridge లో పెడదాం లే "అని cut చేసింది
fridge లో ఇంకా place ఉందా ? its a space miracle అనుకున్నా ..
అమ్మ దీ fridge దీ ఎన్నో ఏళ్ళ అనుబంధం, నాదీ fridgeదీ ఋణానుబంధం.
నేను fridge లో నుంచి ఏదైనా తీసుకోవాలి అంటే ,door తెరిచి వొంగి చూస్తా, కావాల్సింది ఉందో లేదో చూడాలంటే కనీసం నాలుగు ,వారాలవారీగా పేరబెట్టిన పెరుగు గిన్నెలూ ,మూడు పప్పు గిన్నెలూ ,దోశపిండి ఇడ్లీ పిండి బాక్సులూ ,ఏవిటో తెలీని పిండ్ల బాక్సలు ఒక నాలుగూ, తియ్యాలి.
so ఇప్పుడు ఒక చోట చెయ్యి పెడతా ,,పడిపోకుండా కొన్నిటికి భుజం అడ్డుపెడతా ,మోకాలితో కొన్నిటినీ ,తొడతో కొన్నిటినీ ఆపుతూ ,లోపల పెట్టిన చేత్తో ఏదో కదుపుతా ఆ చిన్న కుదుపు ఒక chain reactionలా మారి ,తెరిచిన doorకి vibrationలా సోకి ,ఆ బరువైన door అమాంతం మూసుకోవటానికొచ్చి నన్ను గుద్దుకుంటుంది , అప్పుడు ఏం చెయ్యాలో తెలీదు.. కాళ్లూ ,చేతులూ busy,నడ్డి మీద డోరు ,ఏడుపొస్తుంది .గట్టిగా అరవాలనిపిస్తుంది , అరిస్తే ఏవైనా రెండు కింద పడతాయేమో అని మానేస్తా .
so ఇప్పుడు ఒక చోట చెయ్యి పెడతా ,,పడిపోకుండా కొన్నిటికి భుజం అడ్డుపెడతా ,మోకాలితో కొన్నిటినీ ,తొడతో కొన్నిటినీ ఆపుతూ ,లోపల పెట్టిన చేత్తో ఏదో కదుపుతా ఆ చిన్న కుదుపు ఒక chain reactionలా మారి ,తెరిచిన doorకి vibrationలా సోకి ,ఆ బరువైన door అమాంతం మూసుకోవటానికొచ్చి నన్ను గుద్దుకుంటుంది , అప్పుడు ఏం చెయ్యాలో తెలీదు.. కాళ్లూ ,చేతులూ busy,నడ్డి మీద డోరు ,ఏడుపొస్తుంది .గట్టిగా అరవాలనిపిస్తుంది , అరిస్తే ఏవైనా రెండు కింద పడతాయేమో అని మానేస్తా .
మొన్న చంద్రముఖి సినిమా టీవీ లో వస్తోంది .అదేదో room door open చెయ్యటానికి భయపడుతున్నారు అందరూ ,నాకేం భయం లేదు మా fridge డోరే open చెయ్యగలను ,ఇదెంత అనుకున్నా
ఒక రోజు అమ్మ ఊరేళ్తూ " time కి తిను నాన్న ..అన్నీ fridge లో ఉన్నాయి " అంది ,
ఆ " fridge " అనే పదం వినగానే ,ఏదో అగ్నిపర్వతాలు పేలిన visual పడుతుంది నాకు ..
ఒక సారి గొంగూర పచ్చడి fridge లో కస్టపడి వెతికి అన్నం లో కలిపి రెండు ముద్దలు తిన్నా, తరవాత తెలిసింది అది గొంగూర కాదూ గోరింటాకూ అని.
అన్నుంటే confuse అవ్వమా ,ఇంకా ఏమేముంటాయో తెలుసా ,నేను పదవ తరగతి లో అందరికీ పంచగా మిగిలిన చాక్లేట్లు,పోయిన గోదావరీ పుష్కరాల నీళ్లు, fixed లో వేసినట్టు, నెయ్యి తియ్యాలని కాలాల వారీగా వేసిన వెన్నా, అప్పుడెప్పుడో త్వరగా చల్లగవ్వాలని అని డీఫ్రీజ్ లో పెట్టిన రాయి అయిపోయిన బాటిలూ ,minimum two years నుంచి తెరవకుండా ఉండిపోయిన రకరకాల సైజుల Tupperware డబ్బాలూ ,ఇంకా కాలక్రమేణా ,vegetable box లో booksuu,freezerలో AC రిమోటూ ,కొన్ని దస్తావేజులు ,ఒక మసి గుడ్డా ,అల్మారా తాళం చెవులూ ఇలా చిత్ర విచిత్రమైనవన్నీ చేరాయి .... ఏదో ఒక రోజు పాత చెప్పులూ ,Gas సీలిండరూ ,రెండు మొక్కలూ ,ముగ్గు పిండీ లాంటివి కూడా చూస్తాను అని నా mindని prepare చేసుకున్నా
ఈ మధ్య ఒక uncle తో నవ్వుతూ మాట్లాడుతున్నా ..
"నీకు మీ అమ్మ, మాటలు ఉగ్గు పాలతో పోసిందోయ్ " అన్నారు
"జాగ్రత్త గా వెతికితే ఆ ఉగ్గు పాలు కూడా fridge లో దొరుకుతాయి uncle అన్నాను, ఏవిటో నా కాన్ఫిడెన్సు
మీకో విషయం తెల్సా నాకెప్పుడైనా మనసు బాలేకపోతే మా fridge తలుపు తెరిచి కాసేపు చూస్తూ ఉండిపోతా ..
" ఛి,ఛి దీని ముందు నా సమస్యలెంత " అనిపిస్తుంది నాకు .. jolly గా వెళ్ళిపోతా , మా నాన్న గారు కూడా ఇలాంటిదేదో అలవాటు చేసుకొనే వుంటారు ,ఆయనకు మాత్రం బాధలుండవా ?
last week అయితే లక్ష్మి తెచ్చిన ఇస్త్రీ బట్టలు తీసుకొని అమ్మ fridge వైపు వెళ్తోంది ,నాకెందుకో అది slow motion లో కనపడింది ,నేను అమ్మకీ fridgeకీ మధ్యలో వెళ్లి ఆపి అల్మారా అటుందమ్మా అని చూపించాను
" ఓ అవును కదా !! " అని అటు వెళ్ళిపోయింది ..నేను రాకపోయివుంటే ఏమవును ? అనుకున్నా
మా fridge కూడా తానొక fridge అనే విషయం మరిచిపోయి ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం !!
చెబితే అమ్మ తిడుతుందిగానీ, fridge door open చేస్తే, వెన్నా,జున్నూ,పాలూ, పన్నీరూ,సగం కోసిన నిమ్మకాయా ,కుళ్ళిన కొబ్బరికాయా,ఎండిన కరివేపాకు ,మళ్లీ వాడాల్సిన చింతపండూ, open గా పెట్టిన ఇంగువ ముద్దా అన్ని కలిపి ఒక incomparable smell వస్తుంది ..and that is close to chloroform ,దాన్ని భరిస్తూ వెతకాలి నేను ఏదైనా వెతకాలంటే
అసలైన pain ఏంటో తెలుసా, door close చెయ్యగానే దాని మీద
" Ever Lasting Freshness " అనే company sticker ఉండటం ...
heey ..one minute !! అమ్మ లోపల నుంచి పిలుస్తున్నట్టుంది
"ఏమ్మా ..??"
"ఏంటి ?? ....fridge లో ?? "
"మునక్కాయలూ ...??"
"ఎదిరింట్లో ఇవ్వాలా ?? ... ఆ సరే "
చచ్చాం !!! fridge లో మునక్కాయాలంటా ... కచ్చితం గా horizontal గా పెట్టుంటుంది అంటే సగానికి పైగా clear చెయ్యాలి ..ఉఫ్ఫ్ .. ఇక్కడ మీకోటి చెప్పాలి మొన్న పొట్లకాయలు తీసినప్పుడే తెలిసింది ,మా fridge లో ఒక light ఉంటుందనీ అది door తెరిచినప్పుడల్లా వెలుగుతుంటుందనీ ...
సరే ఆ మునక్కాయల పని చూసి ఇప్పుడే వస్తా ,(ఇప్పుడే వస్తా అంటే ఇక కష్టం అని అర్థం )
yours
Guru
8 comments:
Loved the narration!! Ne manasantha fridge alochanale vunnatunnai..gangamma jathara puravasthu shakara.. bhale comparison .Ever lasting freshness is too good 😂😂😂.Fridge thisinaparthisari ne bavaalu fridge manobavaalu gurthosthunai...🤣🤣🤣Keep writing
అబ్బ!!! అలా అలా చదువుతూ చదువుతూ చిన్నప్పుడు మా fridge ని గుర్తు చేసారు sir...
అసలు ఆ చిన్నప్పటి మా fridge ఇప్పటికి ఏ ఇనప సామాన్ల వాడూ దానిని చంపకుండా ఉంటె, ఇది చదువుతున్నంత సేపు అది పొలమారుతూ ఉండేది sir
అద్భుతంగా రాసారు. " దీని ముందు నా కష్టాలెంత" అనుకోవటం భలే ఉంది. దాదాపు అందరి fridge ల పరిస్థితి ఇదే కాబట్టి.బాగా connect అయ్యే post. రాస్తూ ఉండండి. హాయిగా నవ్వుకుంటాం :)
Nice one Guru.. Elections లో Fridge గుర్తు తో ఎవరైనా పోటీ కి నిలబడి, నువ్వు చెప్పినట్టు Fridge మనకి ఎంత ఉపయోగ పడుతోంది, Fridge లో మీ వస్తువులను చల్లగా ఉన్నట్టు మిమ్మల్ని చల్లగా chusukuntanu అని ప్రతి ఇంటికి ఒక Fridge ఉచితంగా istaanu అని హామీ ఇస్తే.😜😜😜 ప్రతి ఇంట్లో ని అమ్మ లు ఆ ఇంట్లోని అందరితో ఆ గుర్తు కే ఓటు veyistaremo 😀😀😉😉..
Fridge lo kooda inni kashtaluntayani, oka pedda task list daguntundani. Aa task datatanikoka war strategy Inka safety measures kavalani Ippude telusukunna. Chaala funny ga undi Charan nee fridge samasya. Nee fridge lonchi naakoka Minal’s ginja istaava?
అసలే వాడిది detective brain ,ఫట్మని ఆరో chance కల్లా చెప్పేసాడు ..... ikkaDinunDi nunDi paLLu ikilinchaDam modaleTTaanu anTE ..... మా fridge లో ఒక light ఉంటుందనీ అది door తెరిచినప్పుడల్లా వెలుగుతుంటుందనీ ... varaku alaa ikilistuunE unDipOyaa... adEdO Happydent White Ad lO laaga :D tammuDuu... suuper anTE suuper. konni konni points enta connect ayyaananTE ... okka saari maa inTlO unna fridge teesi chooDaali anipinchEnta :D
కనీసం నాలుగు ,వారాలవారీగా పేరబెట్టిన పెరుగు గిన్నెలూ ,మూడు పప్పు గిన్నెలూ ,దోశపిండి ఇడ్లీ పిండి బాక్సులూ...... ఒక సారి గొంగూర పచ్చడి fridge లో కస్టపడి వెతికి అన్నం లో కలిపి రెండు ముద్దలు తిన్నా, తరవాత తెలిసింది అది గొంగూర కాదూ గోరింటాకూ అని..... నేను పదవ తరగతి లో అందరికీ పంచగా మిగిలిన చాక్లేట్లు,పోయిన గోదావరీ పుష్కరాల నీళ్లు, fixed లో వేసినట్టు, నెయ్యి తియ్యాలని కాలాల వారీగా వేసిన వెన్నా, అప్పుడెప్పుడో త్వరగా చల్లగవ్వాలని అని డీఫ్రీజ్ లో పెట్టిన రాయి అయిపోయిన బాటిలూ..... సగం కోసిన నిమ్మకాయా ,కుళ్ళిన కొబ్బరికాయా,ఎండిన కరివేపాకు ,మళ్లీ వాడాల్సిన చింతపండూ........ నేను అమ్మకీ fridgeకీ మధ్యలో వెళ్లి ఆపి అల్మారా అటుందమ్మా అని చూపించాను........
Kevvvvvvvvv anTE kevvvvvvvvv antE... Keep Writing. :D
in the first case, fridge clean cheyaleni nee badhakam kanapadutondi. me mother fridge sardatledani prapanchaniki teliyajeyalsina pani ledu. I don't see any laughable content except you.
when a stupid doesn't realise that he's one, he becomes an idiot.
Awesome Bro... Almost oka 10 times chadivanu ee blog ni
Post a Comment