Tuesday, November 17, 2009

అదృష్టం

క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం,
మాలాక్ల్ ప్తాసనస్దః స్పటికమణినిభైః మౌక్తికైర్మణ్డితాంగః|

అని అంటున్నాడు బాషా  గాడు వునట్టుండి ..వీడేంటి ఇంత బాగా విష్ణుసహస్రనామం చెబుతున్నాడు అని ఆశ్చర్యపోయాను, అలా నోరు తెరిచి చూస్తుండిపోయ వాడిని .. ..సంతోషం తో నా కళ్ళలో నీళ్ళు...  వెంటనే ఎవరో నా భుజం మీద టపా, టపా  కొట్టారు  ...ఎవరా...? అని చూస్తే మా అమ్మ కనపడింది ..ఇటు చూస్తే tape recorder లో M.S. Subba lakshmi విష్ణుసహస్రనామం చెబుతూ కనపడింది   ! "ఓహ్!! ఇది కలా? అదే కదా..లేక పోతే బాషా గాడు మంత్రాలు చెప్పటమేంటి నా తలకాయి"   ...అనుకుంటూ మళ్ళీ కలను continue చేయ్యబోయా  ..అంతలోనే "లేవాలి లేవాలి "  అని నా చెవిలో ఎవరో అరిచారు ఉలిక్కి పడి లేచా..లేచి వాళ్ళని విసుగు కళ్ళతో "gud morning" అని తిట్టా...ఓ సారి Time చూసుకున్నాను ..నా గుండె ఆగిపోయింది..Man it was 4 O clock "AM" ..."మీరు మనుషులా రాక్షసులా?   ఉదయం నాలుగు గంటలకి ఎవరైనా నిద్ర లేపుతారా? ఎందుకు చేసుకుంటారో  పెళ్ళిళ్ళు, మా సావుకోచ్చాయి .." అని అనుకుంటూ ఏడుపు గొంతుతో బెడ్డు దిగా  ...మళ్ళీ అదే వ్యక్తి ..."లేవాలి లేవాలి " అని అరుస్తూ వెళ్తున్నాడు...."ఆ లేచాం లే " అనుకున్నా ! ....ఇంత లో... "రేయ్ నువ్వొక్కడివే  రా ఇంకా  స్నానం కూడా చేయంది..పిల్లల స్నానాలు కూడా అయిపోయాయి  .." అంది పిన్ని ...సారీ అది పిన్ని కాదు  పెద్దమ్మ!! ..నిదర మత్తు ఇంకా వదలలేదు కదా, కాస్త Confuse అయ్యా ..! .."మా అమ్మ ఎక్కడ  పెద్దమ్మా? " అని అడిగా నిదర గొంతుతో ...."కాస్త కళ్ళు పెద్దగా తెరిచి చూడరా కనపడుతుంది" అంది..నా కళ్ళ చేత తిట్టించుకుంటూ కళ్ళు పెద్ద గా తెరిచా ....ఆ పక్కనే కనపడింది ...."అమ్మ నా brashhu , బట్టలు ఎక్కడున్నాయమ్మా" అని అడిగింది నా ప్రభాస్ గొంతు ..." సిగ్గు లేకపోతే సరి వీడికి  ఇంకా అన్ని  వీళ్ళమ్మే ఇవ్వాలి... " అంది మా నిర్మలమ్మ, అలియాస్ మా అమ్మమ్మ ....నా expression change కి react అవుతూ  " పోన్లేరా ముసలావిడ " అన్నట్టు చూసింది మా అమ్మ ...సరే లే అని బాత్ రూం లోకి వెళ్ళబోతూ  అలా పక్కకి చూసా....అంతే!! ..దొరికాడు ...చిన్నగా కునుకు తీస్తున్నాడు ...వెంటనే నేను.... "లేవాలి లేవాలి " అని మొత్తుకొని  ...బాత్ రూం లోకి దూరి తలుపేసేస్కున్న ...."ఏమయ్యిందో  ఏమిటో .." అని అనుకునే లోపు ..గొల్లున నవ్వులు వినపడ్డాయి ..."హి హి హ హ సెబాస్ " అని బ్రష్ తో భుజం మీద 2 times కొట్టుకున్నా.ఒక గంట తరవాత Car Door తెరిచి కాలు కింద పెట్టాను.తరవాత అందరూ పెట్టారు ,Car దిగి మా gang ని ఓ లుక్కేసా! అందరు యథాశక్తి  రెడీ అయ్యారు,అందరిలో full confidence ..అదేదో పెద్ద మగ పెళ్ళివారైనట్టు,.... Grand గా  లోపలికి నడిచాం ..

                                                                లోపల .... Dhirubhai ambaani తానే స్వయంగా వచ్చి
decoration చేసినట్టు భలే rich గా వుంది ,"పర్లేదే..!" అని వెనక్కు తిరిగి  పిన్ని తో ఏదో చెప్పబోయా..నా వెనక ఎవరన్నా వుంటేనా ?.. Elimination rounds అన్ని పూర్తి  చేసుకున్న Final winner లాగ అలా నన్నోక్కడినే వదిలేసి ఎటో పోయారంతా ...ఇ  shock లోంచి  తేరుకునే లోగ.."అరే వాః..!   Next  పెళ్లి కొడుకువి నువ్వేనా ?ఇంత బాగా తయారైయ్యావేంట్రా ...?"  అన్నాడు బావ (ఆయన చెబితేనే తెలిసింది ఆయన నాకు బావ అవుతాడని)....ఇంత లో అమ్మొచ్చి "రేయ్ సరళ పిన్ని కి ఈ చీర అంట ఇచ్చేసి రారా " అంది ....."ఆమెక్కడుంది ?" అన్నాను ..."పెళ్లి కూతురిగది లో " అని చెప్పి "ఆ  బాగున్నారా..."అంటూ  వెళ్ళిపోయింది  ........"Hmmm..!So, పెళ్లి కూతురిగది ..Interesting" అనుకున్నాను .!..ఇంక నాలుగు అడుగుల్లో  గది వచ్చేస్తుందనగా ...కాస్త  collar సరిచేసుకొని  ...అలా వేసి  వేయని  తలుపును తోసాను ..అక్కడ అంత మంది అమ్మాయిల మధ్య already ఒక  handsome అబ్బాయి వున్నాడు ...Immediate గా realize అయిన విషయం ఏంటి అంటే ..అది నేనే ...నిలువుటద్దం లో అలా  కనపడ్డా....కొత్త బావ చెప్పిన మాట నిజమే అనుకున్నా ..!  Successful గా పని పూర్తి చేసుకొని బయటకి వచ్చా ...ఏమాటకామాటే..అంత మంది అమ్మాయి ల మధ్య Solo performance  కష్టమే అనిపించింది ..! ఈలోగా  ఏదో   re-wind అయిన  sound వచ్చింది ...వెంటనే   నాకు  "దీనినే భూలోకవాసులు ఆకలి అందురు ప్రభు " అన్న బ్రహ్మానందం   dialogue గుర్తుకు వచ్చింది ....ఛి,ఛి,ఛి .. "తిన్నావా..?" అని అడిగే నాథుడే లేడు అని, మండపము వైపు అలా చూసా ..."ఎవడి గోల వాడిదే " సినిమా  Live telecast చూస్తున్నట్టు  అనిపించింది ..! ...నేను నా చూపు with draw చేసుకునే లోపు ....అంతటి గోల ఏక్ ధమ్ Calm అయిపోయింది ...మండపానికి మ్యూటెట్టినట్టు అయింది ...నాకు ఆ అమ్మాయి తప్ప ఏమి కనపడడం లేదు ...background Blurr...పడుచు వయసులో వున్న తెలుగుతల్లిలా వుంది ....నా కళ్ళు కొట్టుకోవటం మానేసి చాలా  సేపైంది ...ఇంకా చూస్తూనే వున్నా .... Sudden గా ....మంచి Frame చూపిస్తున్న Video Camera  కిందపడట్టు అల్లకల్లోలం అయింది .... ఎవరో ఒకాయన నాగార్జున doop కి doop ల వున్నాడు తన వీపుతో నా భుజాన్ని గుద్దిపార్నూకాడు....ఏదో English లాంటి భాష లో రెండు లైన్ల సారీ చెప్పాడు....రెండు రూపాయల పాటల బుక్కులో వున్నన్ని తప్పులు వున్నాయి ఆ Two lines లో  .... ఆయనకి నేను ఒక "Thats ok " Look ఇచ్చా..ఇచ్చి.. నాలుగు Frames లో నాలుగు దిక్కులు వెతికా  ఆమె కోసం ...  మిస్ అయింది ...ఇహ చేసేదేమీ లేక ..ఆకలేస్తూంది  కదా అని వంటశాల వైపు నడిచా ...exact గా entrance ముందు వుంది మన హీరోయిన్ ...ఎవరో చిన్న పిల్లాడిని ఆడిస్తోంది ...ఎలాగైనా సరే మాట్లాడేయాలి అని Sketch work start చేశా ...వడి వడి గా నడుస్తూ వెళ్తున్నా!... "ఏమ్మా "మమ్ము" తిన్నావా?.."లాల" పోకున్నావా?" అని మాట్లాడిస్తోంది ఆ బుడ్డోడిని, నేను ఆ పక్కనే నిలబడ్డా వెళ్ళి...నన్ను చూసింది ...నేను  ఆల్రెడీ తెలిసినట్టు చిన్న friendly నవ్వు నవ్వి మళ్ళీ  బుడ్డోడితో చిన్న పిల్లల భాష లో మాట్లాడుతూంది ....నేను ఏమైతే అధైందని.."veeeeeery  Cute ..." అని అన్నా Confident గా .. "ఆ!! బాగా అల్లరి కూడా " అంది ... ఆ Voice కి ఒక Nobel Prize ఏస్కున్నా... అప్పుడు నేను ఏమాత్రం Hesitation లేకుండా చిన్న Gap తీసుకొని ..."నేనన్నది  మిమల్ని "  అన్నాను ....ఆ చిన్న పిల్లాడిని వాళ్ళమ్మ కి hand Over చేస్తూ ..."నేను చెప్పింది కూడా నా గురించే"  అంది కళ్ళతో నవ్వుతూ....నేను "ఆ అర్థమవుతోంది  " అన్నాను చేతులు  కట్టుకుంటూ ...."Coffee తాగుదాం వస్తారా?" అంది వంటశాలని  చూపిస్తూ...తంతే తమన్నా గది లో పడడం అంటే ఇదే  అనుకొని  ..."అలవాటు లేదండి " అన్నా.."Company ఇవ్వటం కూడానా ?" అంది.."హహహ పదండి" అన్నా.... నడవటం మొదలు పెట్టాము...నా పక్కనే  తను..పక్కనే అంటే పక్కనే ... "మదిలో ~ వీణలు మోగే ~ఆశలెన్నో చెలరేగే ~" లాగా వుంది మన పరిస్థితి...  ..నా మొహం మీద రెండు చిటికలు వేసి "Hellow ... Coffee !" అని చేతికి ఇచ్చింది ...వామ్మో అప్పుడే ఇంత జరిగిందా? ఇలాంటి సమయాల్లో presence కోల్పోకూడదు అనుకున్నా....ఆ పక్కనే Chairs లో  ఎదురు బొదురు గా settle అయ్యాం ...రెండు సిప్పుల తరవాత ...."మీ చీర చాల చాల బాగుంది  " అన్నాను  Sekhar kammula cinema లో Hero లాగా ..."Neerus " అంది Happy Face తో ...."ooh!! gud " అన్నా  ..ఇంకో  సిప్పు తరవాత ..."మీ ముద్దు పేరు ఏంటి ?" అని Decent గా  అడిగాను.. "ముద్దు పేరు అంటూ ఏం లేదు ..అందరు శృతి శృతి అనే పిలుస్తారు " అంది...." శృతి !! ...what అ beautiful Name " అని అనుకున్నా...."what is your Name ?" అని Direct గా అడిగి వుంటే, ఈ  పేరు ఇంత బాగుండేది కాదేమో అని అనుకున్నాను..... ...ఏదో అడుగుదామని ఆమె కేసి చూశాను ఇంతలో  చల్లగా గాలి వీచింది...Unexpected గా ఎగిరిన ఆమె జుట్టును తన వేళ్ళతో కోమలంగా చెవి వెనక్కి సర్దుతోంది ...అంతే!! నా గుండె గుటకలు వేయటం మొదలెట్టింది..గాలి ఆగిపోయింది ..నేను  వెంటనే "
శృతి ఇప్పటిదాకా మీకు  ఎంత మంది చెప్పివుంటారు ?" అని అన్నాను ..."చెప్తూనే వుంటారు" అంది...వాడియమ్మ!! Catch చేసేసింది ..నేను అంత ఇది గా చూడడం చూసినట్టు వుంది అనుకున్నాను..!...నాకు ఇంకా ఇంకా నచ్చుతోంది  తను..."శృతి మీలాంటి తెలివైన అమ్మాయిలంటే నాకు చాల ఇష్టం ... ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ?" అన్నాను..! చిన్న గా నవ్వి "చదువు అయిపోయింది ఇంట్లో Matches చూస్తున్నారు ఒకటి almost  final అయింది...నాకు అబ్బాయి బాగా నచ్చాడు అన్ని కుదిర్తే Next month లో పెళ్ళి ఉండచ్చు" అంది ...నేను  మెల్లి గా "తమన్నా" గది లోంచి  బయటకి వచ్చేసాను..గాలి తీసేసిన Tube లా అయిపోయాను..బాగా Disappoint  అయ్యాను, మొహం లో కనపడిపోతోంది Clear గా ..."ఓ అలాగా..All the best మరి "  అన్నాను రక్తపు చుక్క లేని మొహం తో.." Thaanq " అంది... అక్కడనుంచి వచేద్దాం  అనుకున్నా కాని ఈ  విషయం తెలిసిన వెంటనే వచేస్తే బాగోదుకదా!...కాసేపు company నటిద్దాం అనుకున్నా...  తనేదో మాట్లాడుతోంది నేను వినట్లేదు....నేను phone తీసి చెవిలో పెట్టుకుని ...
" హలో "  " నేనా?... ఇక్కడే.. kitchen లో వున్నా"   "దేనికి?" .."అలాగా"   "వస్తున్నా"   "5 Mins "   అని ..."సారీ శృతి I got to go...Nice talking to you " అని Clean Bowled అయిన batsman లాగా ఏడుపు Face తో అక్కడి నుంచి వచ్చేసాను ..పెళ్ళంతా అలా Dull  గానే వున్నా ....
                                       
                                                   Evening మా Cousin batch ని ఏస్కొని second show కి వెళ్ళొచ్చి ..పడుకున్నా...మా అమ్మ పతీ సమేతంగా వచ్చింది ...వామ్మో ఈ  టైం లో ఈ  attack ఏంటి ..అనుకొని ....."ఏంటమ్మా ..?" అని అడిగా నాన్న మొహం చూస్తూ ..."ఏం లేదు  నాన్న.... సుగుణ aunty లేరు, వాళ్ళ అమ్మాయి కి సంబంధాలు చూస్తున్నారంట...నీకొకసారి  చూపించమని అమ్మాయి  Photo ఇచ్చి వెళ్ళారు ..నువ్వొక సారి చుస్తావేమో అని ..." అంది ". అమ్మా! ఒంటి గంట అవుతోందమ్మా ..అయినా  నాకింకా time కావాలి అని చెప్పాను కదా?" ..."అబ్బా !!చూసి వద్దని చెప్పరా ..అంత విసుగెందుకు ?" అంది విసుగ్గా ..."ఇప్పుడేంటి?? చూసి వద్దనాలి అంతేగా ఇటు theeey " అని అమ్మ  చేతిలోంచి Photo పీక్కుని  ...చూసి .."ఆ !!..వద్దు"  అన్నా Serious గా ..."సరేలే రా  నీ ఇష్టం" అంటూ లేచి వెళ్ళిపోయారు ...కరెక్ట్ గా వాళ్ళు  Room Door దాటుతుండగా ..."అమ్మా ...ఏది  ఒకసారి Photo ఇవ్వు " అన్నాను..పరుగున వచ్చి ఇచ్చింది ...నేను మళ్లీ ఒక సారి Keen గా Observe చేస్తున్నంత సేపు  ...మా అమ్మ " చూడరా మంచి సంబంధం..అమ్మాయి MBA చేసింది ..అందంగా వుంటుంది ..వంట వార్పూ తెలిసిన పిల్ల ...పేరు ......" అంటుండగా "ఆపు " అని చెయ్యి చూపించా ..."పేరు శృతి !! " అని sentence fill up   చేశా......"అరే!  నీకు  ముందే తెలుసా ?..పెళ్ళిలో చూసావా ..? నీకు చెబితే నువ్వు తిడతావ్ అని చెప్పలేదుగాని నీ ఫోటో కూడా  వాళ్ళకి ఇచ్చాం  ..నువ్వు భలే నచ్చేసావ్ అంట అమ్మాయి కి ...మీ నాన్న "నా పోలిక కాబట్టే  నచ్చుంటాడు" అని బో బడాయి పోతున్నార్రా..!!" అంది మొహం ఊరంత చేసుకొని.....అప్పుడు నేను World 's most Obedient son లాగ ..."సరే నాన్న మీ ఇష్టం ..నాకు okee " అన్నా ఏం తెలీనట్టు ...మా అమ్మ నాన్న 4 years తరవాత కలిసిన Lovers లాగ Happy గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు....తరవాత నేను గాల్లోకి చూస్తూ .."వాసిని !! ఎంత plan ఏసావే ? ఆ నచ్చిన  అబ్బాయిని నేనే నా?...నా సవతి character నేనే పోషించుకున్నానా? భారీ  Level లో బకరా అయ్యానుగా ..ఇప్పుడు కాదే నీ పని పెళ్ళయ్యాక చెబుతా ...హయ్యో ..నాకు తెలివైన అమ్మాయిలంటే ఇష్టమని కూడా చెప్పి చచ్చానే ..." అని అనుకుంటూ ..మొహం తో pillow ని ఢీకొట్టి,  మళ్ళీ తమన్నా  గది లోకి ఎంటర్ అయ్యా ...అన్నట్టు చెప్పడం మరిచిపోయా Photo Pillow మీదే వుండిపోయింది ...ఆ విషయం ఇప్పుడే తెలిసింది ....వుంటా మరి Good night ...అవతల చాలా పనులున్నై ..ఐబాబోయ్ సిగ్గేసేస్తోంది ..! 

Our Special Thanks to Kumari Thammana 




Regards
Guru Charan Sharwany

Wednesday, November 4, 2009



నా  Dairy లో  ఓ  పేజీ...


                                                  

ఆ సాయంత్రం  నా  మనసు ఏం బాగోలేదు.అలా చల్లగాలికి  తిరిగి  వద్దాం  అని  బయలుదేరాను .చొక్కా  వేసుకుందాం  అని  నా  rack దగ్గరకు  వెళ్ళాను .పక్క  rack  లో  సిగరెట్ ప్యాక్  ఒకటి  కనపడింది .రెండు  మూడు  సార్లు  నవీన్  నాకు  సిగరెట్ offer చేయడం  గుర్తు  వచ్చింది .మొదటి  సారి  సిగరెట్  packet చేతికి  తీసుకున్నాను .అందులో  ఇంకా  నాలుగు  మిగిలి  వున్నాయి.పక్కనే  వున్న lighter నన్ను  ఉత్సాహపరిచింది. ఒక  సిగరెట్  చేతికి  తీసుకున్నాను .జేబులో  పెట్టుకుందాం అనుకున్నాను .ఇంకా  చొక్కా  వేసుకోలేదు  అని  గుర్తు  వచ్చింది.దాన్ని  పక్కన  పెట్టి  గబగబా  వేసుకున్నాను .సిగరెట్ని  జేబులో  పెట్టుకొని  ఎవ్వరూ గమనించ కుండా  మెల్లగా  బయటకి  వచ్చాను.
.
             

                                    నడవటం  మొదలు  పెట్టాను .సిగరెట్ ని  జీబు  లోనుంచి  నలిగి  పోకుండా  బయటకు  తీసాను. నోట్లో పెట్టు  కొని  జేబులు  తడుముకున్నాను .నన్ను  ఉత్సాహపరిచిన  lighter ని  మరిచాను  అని  గుర్తొచింది.నడక  sudden గా  ఆపేసాను .వెనక్కు  వెళ్ళాలా ? అని  ఆలోచించాను.అగ్గి పెట్టే  అడగటానికి  ఎవరైనా  వున్నారా  అని  చుట్టూ  చూశాను .ఒకడు  కనబడ్డాడు .ఇలాంటి  వాటికి  అన్ని  భలే  కలిసోస్తాయే  అనుకున్నాను .వాడు  ఒక  చిన్న  mini size అగ్గి  పెట్టెను  నా  చేతిలో  పెట్టి  నేను  thanks చెప్పకుండానే  “u r welcome” అని  వెళ్లిపోయాడు ..ఇదేం  ఆనందం  అనుకున్నాను .
                                     
                         నేను  ఒక  ఖాలీగా  వున్న  parking lot చేరుకున్నాను .అగ్గిపెట్టె లోంచి  అగ్గి  పుల్ల  ఒకటి  తీసి ,పుల్ల  వెలిగించాను .సిగరెట్ ని  చేరేలోగా  అది  ఆరి  పోయింది .అరరెయ్  అని  మల్లి  try చేసాను  .ఫలితం మళ్ళీ  అదే .ఈ  సారి  గాలి  వాటానికి వీపు  పెట్టి  జాగర్తగా  ప్రయత్నించాను.. సాధించాను .సిగరెట్  వెలిగించాలి  అంటే  ఇంత  concentration అవసరమా  అనుకున్నాను .ఒక  దమ్ము  లాగాను .దగ్గకుండా వుండడం  నా  వల్ల కాలేదు .మూడు  సార్లు  దగ్గి  ఇంక దగ్గు  పూర్తి  కాకుండానే  మళ్ళి ఇంకొకటి  లాగాను .ఇప్పుడు  కాస్త  better .ఇలా  కాదు  అని  ఈ  సారి  గుండెలదాక లాగాను .కాసేపు  ఏం  అర్థం కాలేదు .పొగ  కూడా  బయటకు  రాలేదు .పొగ  ఎటు  పాయిందా అని  అనుకుంటూ  వుండగా  నాకు  తెలీకుండానే  బయటకు  వచ్హేసింది.ఆ  పొగ ,లోపలి  వెళ్లి  ఎం  చేసిందో  నాకు  తెలీదు .ఒక్క  సారిగా  నా  రక్తం  వేగం  పుంజుకుంది .దాని  friend ని  meet ఐనట్టుగా  ఉరకలు  వేసింది .సర్ర్రున  ఒళ్లంతా  ప్రవహిస్తున్నట్టు  అనిపించింది .నా  వేళ్ళు వణకటం  నేను  గమనించాను .”ఏంటిది ” అని  ఆశ్చర్య పడ్డాను.సిగరెట్  ఐపోతుందేమో  అని  ఇంకో  దమ్ములాగాను .ఈ  సారి  నా అడుగులు  తడబడ్డాయి.తలంతా  బరువు  ఎక్కింది .”ఏం  ఆవతుంది  నాకు ” అనుకున్నా… ఐదో  దమ్ము కి  నా  గొంతు  అంతా  కారం  కారం  గా  మారిపోయింది .తప్పు  చేస్తున్నానేమో   అనిపించింది .“అయినా   life లో  అన్ని  రుచి  చూడాలి లే ” అని  rules ని  నాకు  అనుగుణంగా  మార్చుకున్నాను .ఆరో  దమ్ము  కి  తల  అంతా  మత్హు  గా  తయారైంది .బాగుంది  అనిపించింది .ఇంకో  రెండు  లాగాను .”దమ్ము  లాగి  నట్టున్ధే ” అని  ఆ  పాటలో  ఎందుకు  రాసారో  అప్పుడు  అర్థం  అయింది .సిగరెట్  ఐపోవచింది  అని  చూసి
అయినా  ఇంకొకటి లాగుదాం  అనుకున్నాను ,చివరిదాకా   తాగడం  health కి  మంచిదికాదు  అని  ఎవడో  చెప్పినట్టు  గుర్తుకు  వచ్చింది .దాన్ని   అవతల  పారేసాను.

                         
ఒక  కొత్త  అనుభూతి  తో  ఇంటి వైపు  అడుగులు  వేసాను .దీని  కోసమా  అందరూ దీనికి  addict అయ్యేది  అని  అనుకున్నాను .రింగు  రింగులుగా  పొగ  వదులుతారు  కదా అలా try చేయడం  మరిచిపోయానే  అని  అనుకున్నాను .ఈ  సారి  try చేద్దాంలే  అని  అనుకుంటూ  వుండగా ,నేను  సిగరెట్  పారేసే   ముందు  దాన్నిఆర్పానా  లేక  ఆర్పకుండా  పారేసాన   అని  doubt వచ్చింది .వెంటనే  సిగరెట్  వల్ల  జరిగిన  fire accidents అన్ని  గుర్తువచ్చాయి .పరుగు  పరుగున అక్కడికి  వెళ్లి  నేను  పారేసింది  ఎక్కడ  పడిందో  వెతికాను.నా  అనుమానం  నిజమైంది  అది  ఇంకా వెలుగుతూనే  వుంది .పక్కనే  చిత్తుకాగితాల  dustbin వుంది .ఇంతలో  ఎంత  ప్రమాదం  తప్పింది  అనుకున్నాను .వెంటనే  దాన్ని  కసితీరా కాలితో  తొక్కి  ఆర్పేసాను …తల  ఏత్తి చూస్తే  పక్కనే  petrol bunk కూడా  వుంది .నాకు  చెమటలు  పట్టాయి .ఒక  పెద్ద  నిట్టుర్పు  విడిచాను.ఎందుకు మనకి ఈ  కొత్త  అలవాటు   అనుకున్నాను .
                                     ఈ  విషయమే  ఆలోచిస్తూ  ఇంటికి  చేరుకున్నాను .తలుపు  తీసి  హాల్  లోకి  వచ్చి  మళ్ళి తలుపువేసి  లోపలికి   వెళ్లబోయాను ..అంతలోనే  ప్రవీణ్  “ఎం  గురు  సిగరెట్  తాగి  వచావా ?” అని  అందరి  ముందు  అడిగాడు .అప్పుడు  అర్థం  అయింది  నేను  నాతో  పాటు  hall లోకి  సిగరెట్  కంపుని  కూడా  తీసుకు  వచ్హాను అని .”ఆ  just ఊరికే   ..ఎలా  వుంటుందో  చూద్దాం  అని ” అంటూ  ఒక  వెకిలి  నవ్వు  నవ్వాను .
                                   
                                  తరువాత  straight గా  bathroom లోకి  దూరాను .అద్దంలో  పెదవులు  ఏమైనా  నల్లగా  అయ్యఎమో  అని  చూసుకున్నాను  “ఒక్క  దానికి   ఏమవ్తుందిలే ” అనుకున్నాను .నా  నోటి  నుంచి  వచ్చే  వాసనకి  నా  మీద  నాకే  అసహ్యమేసింది .brush అందుకున్నాను  దాని  మీద  1 /2  kg paste వేసుకుని  పళ్ళ ని  ఎడా పెడా తోమేసాను ,ఇప్పుడు  కొంత  మేలు  అనుకున్నాను .”అయినా ఇప్పుడు  నేను  ఎం  అంత  తప్పు  చేసాను ” అని  నా  మనసుని  నేనే  ప్రశ్నించుకున్నాను  నా Conscience convince అవ్వలేదు .అప్పుడు  నేను  తప్పును  ఒప్పుకోవడం  సగం  దిద్దుకోవడంతో  సమానం  అని  తెలుసుకున్నాను .అప్పటికే  side effects మొదలైయ్యాయి.యద అంతా  నొప్పిగా  అనిపించింది  జీవితం  లో  ఎప్పుడూ smoke చెయ్యకూడదు  అంటే  ఓ  సారి  smoke చెయ్యాలేమో  అనిపించింది !!
                                     ఈ  విషయం   అమ్మకి  తెలిస్తే  ఆమె  ఎంత  నొచ్చుకుంటుంది  అని  ఆమె  మొహం  గుర్తు  చేసుకున్నాను .చాల  భాదేసింది .ఒక్కసారిగా  దుఖ్ఖం  కమ్మేసింది .ఎంతో  మనస్తాపానికి  లోను అయ్యాను .బాధని ఆపుకోలేకపోయాను.

                                     ఇంత  బాధకి  నాకు  మెలకువ వచేసింది.కళ్ళు  తెరిచి  చూస్తే  నేను  మంచం  మీద  వున్నాను.టక్కున  లేచి  కూర్చున్నాను.నేను  ఏ  తప్పు  చేయలేదని,నేను  బాధ పడాల్సిన  అవసరం  లేదు  అని ,నా  వ్రతం  చెడి  పోలేదని  తెలిసి  పట్టలేనంత  సంతోషమేసింది .కల  నిజం  కాక  పోతే  కూడా  ఇంత  happy గా  ఉంటుందా అనుకున్నాను ..అంతలోనే  నవీన్  “good morning బాసు ” అంటూ  సిగరెట్  pack తో  కనబడ్డాడు …”very good morning నవీన్  నాకు  ఓ చిత్రమైన  కల  వచ్చింది  ఏంటంటే ….”   అంటూ  మొదలెట్టాను ……


NOTE: cigarette smoking is INJURIOUS to health.
Thank you

Love in Auto


“బాబు  Kukatpalli ఒస్తావా ?”అని  అడిగాను ….
Scene కట్  చేస్తే  నేను  Auto లో  వెళ్తూ  వున్నాను , auto వాడు  ఇంకొకడిని  ఎక్కించుకున్నాడు …ఎవరు  నా  తోటి  ప్రయాణికుడు? అని  అలా  ఒక  rough look ఇచ్చాను …ఆ  face ఎలా  వుంది  అంటే…కాస్త  కంగారు ,కాస్త  ఇబ్బంది ,కాస్త  బాధ ,కాస్త  ఆలోచన …అన్ని  తగు  పాళ్ళల్లో  కలిసినట్టు  అనిపించింది ...ఏమైందో  అనుకున్నాను ….
auto వెళ్తూ  వుంది ….Sudden గా  అతని  phone మోగింది …చాలా  quick గా  lift చేసాడు …lift చేసి …ఒక  5 secs తరువాత …
 

“చేసిందంతా  చేసి  ఇప్పుడు  ఇలా  ఏడిస్తే  ఎం  లాభం  లేదు ” అన్నాడు ..నీను  ఉలిక్కి  పడ్డాను ..
“Point out చేసే  ముందు  ఒక్క  సారి  ఆలోచించాలి ”అన్నాడు ….”పాయింట్  ఏ  కదా ” అనుకున్నా ..నాలో  interest పెరిగిపాయింది…

“ఏవరో ఏదో  అన్నారని  నా  మీద  డౌట్  బడకు ”
అనే  సరికి …”aaaaai !! ఇదీదో  మనకి  match అయ్యేటట్టు  ఉందే ” అనుకున్న …..“Please ఈ  ఒక్క  సారికి  Understand చేస్కో  please..” అన్నాడు  కాస్త  voice low చేసి …నేను  మనసులో  “ఎవ్వరినెప్పుడు  తనవలలో  ~ భందిస్తుందో  యి  ప్రేమ ~” అనే  పాట  తలుచుకున్నాను ….

“నువ్వు  నాకు  Ten minutes Time ఇస్తే  ఇప్పుడే  number change చేస్తా ” అన్నాడు …అవతలి  వైపు  talk ఏమై ఉంటుందో  guess చేయటానికి  నాకు  తెలిసిన  cinema కథలన్నీ  పెట్టి  చూసాను  ..ఉహు ! ఎక్కడో  Screen play miss అయింది  అనిపించింది …
ఈ  మద్యలో  నేను  ఒకటి  గమనించాను …నేను  మెల్లిగా  నాకు  తెలీకుండానే  అతని  వైపు  జరుగుతున్నా …వెంటనే  “వామ్మో  నేను  వింటున్నాను  అని  తెలిస్తే  జాగర్త  పడతాడు …దాంతో  నేను  Story full గా  వినలేను ” అని …నా  జవసత్వాలన్నీ  ఇటు  వైపు  వదిలీసి  అలా  బయటకు  చూస్తూ  నా  చెవిని  మాత్రం  Terminator cinema లో  లా  అలా సాగాదీసాను  అతని  mobile దగ్గర  పెట్టాను.

“నువ్వు  Only నీ  వైపు  నుంచే  ఆలోచిస్తే  ఎట్లా ?” అన్నాడు  కాస్త  voice raise చేసి ….Matter O మాదిరి  గా  అర్థం  అయింది …కాని  ఎం  జరిగుంతుందో  అర్థం  కాలేదు…కుతూహలం  మరింత  ఎక్కువైంది ….“నేను  అట్లాన్తోడ్నే ఐతే  నిన్న  నైట్  నేనే  ఎందుకు  Call జేస్తా ?” అన్నాడు …ఐపోయింది  నాకు  mental ఒచింది ..”ఓరేఏఏఎయ్ !! నా  మటుకు  నీను  ORKUT  లో  ఎం  Caption పెడదామా  అని  ఆలోచిస్తుంటే …Youtube లో  Video లా Buffer అయ్యి  Buffer కానట్టు ,Vadafone connection లా  వినిపించి వినిపించానట్టు ,అయ్యప్ప  సామి  జ్యోతి  లా  కనిపిచ్చి  కనిపించనట్టు…ఎందుకు  రా  నా  feelings తో  ఆడుకుంటావు…
 

అసలు  ఎవరా  అమ్మాయి ? ఎం  చేసింది ?,ఎవరో  నిన్ను  ఏమన్నారు ?,Ten mins లో  number ‘నువ్వెందుకు ’ మారుస్తావ్ ?,నిన్న  night call చేసి  ఎం  చెప్పి  తగలడావ్?” , అని  MS నారాయణ  లాగా  అరుద్దాం  అనుకున్నాను …ఇంతలో …
“ఇప్పుడు  రమ్మంటావా ?? చెప్పు  చెప్పు ??” అన్నాడు  కోపంగా …రమ్మని అంటుందా ? వద్దు అంటుందా ? అని  ఒకటే  tension నాకు ….వెంటనే  అతను …“అన్న  side కి  stop చెయ్యి  అన్న ” అన్నాడు ….రామ్మన్నట్ట్తుంది  అనుకున్న్న …Ten rupees ఇచ్చి  change కూడా  తీస్కోకుండా  వెళ్లి పోయాడు …..నాకు  ఒక  మాంచి  20-20 match చూసిన feeling కలిగింది ..కాని  only one innings live other innings understood అన్నమాట .
 
కాసేపటి  తరవాత  నేను  కూడా  దిగి  వేరే  seven Seater ఆటో  ఎక్కాను …అక్కడ  ఎదురుగా  వున్న అమ్మాయి  phone  తీసి  “నీను  ఇంకో  5 mins లో  అక్కడుంటా! నువ్వోచేసావా ?? ?” అంది …”ఇంతక  ముందు  అతను  phone  చేసింది  ఈమెకే  నా ??” అనుకోని  ఘర్షణ  cinema  లో  వెంకటేష్  లా  నవ్వుకున్నాను ….
.
.

ఎంతమంది  ప్రేమికులు  ఎన్ని  బాధలు  పడుతున్నారో  అనిపించింది … సర్వేజనా  సుఖినో  భవంతు !!
.
.
.
paatakulaku chinna prashnaaa :
పైన  మీరు  చదివిన  చిన్న  సంఘటనా  పగలు  జరిగినట్టుగా  ఉహించుకున్నారా ? లేక  రాత్రి  జరిగినట్టు  ఊహించుకున్నారా ? మీ  Comments లో  తెలుపగలరు …
.

Now trending

Low Budget Movie

        Low Budget Movie ఐదారేళ్ళ కిందట ఫోన్ మోగితే  lift చేసి "హలో సార్ రమేష్ గారు, ఎలా ఉన్నారు ?" అన్నాను  "మౌనంగానే ఎదగమని...

Posts you may like