Sunday, May 16, 2021

Low Budget Movie

       Low Budget Movie

ఐదారేళ్ళ కిందట ఫోన్ మోగితే  lift చేసి "హలో సార్ రమేష్ గారు, ఎలా ఉన్నారు ?" అన్నాను 

"మౌనంగానే ఎదగమని పాట caller tune పెట్టారుగా అది వింటూ ఉన్నా మధ్యలో లిఫ్ట్ చేసేసారు "

"అయ్యో sorry సర్ , పెట్టేయిన..మళ్ళీ చేస్తారా  " 

" ఒద్దు సర్ , విన్నపాటే గా.. విష్యం ఏంటంటే ..మా friend low budget లో cinema తీస్తున్నాడు అందులో ఒక సూపర్ character ఉంది అది మీరు చెయ్యాలి ..." 

"remuneration ఏమి లేదు అంతే గా.." అన్నాను ..

"ఎలా చెప్పారు ? " 

" విన్నపాటే గా..." అన్నాను 

"హహహ లేదు సర్ , ఏమి తీసుకోకుండా చేసినవే మలుపు తిప్పుతాయి .ఇది super character, చెయ్యండి సర్ , నిలబడిపోతారంతే " అనగానే నేను 

కూర్చున్నాను తరవాతంతా నిలబడాలిగా ..

"మీరు ఓకే అంటే ticket ఏస్త" అన్నారు

"ఓకే, ఏసేయండి !! ...bus ఎక్కడెక్కాలి సర్ " అని అడిగా 

"అదే సర్, మీరు cab తీసుకుంటే 450 అవుతుందే , అక్కడే సర్ !! " ఆయన location పేరే చెప్పాడు నాకే ఇలా వినపడింది.


"మీరు దిగగానే రఘు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు ..ఓకే నా సర్ ? " 


              **************

దిగాను  , Busstand బయట నిండు bag ఒక చేత, water bottle ఒక చేత పట్టుకొని wait చేస్తున్నాను ,

"car పంపటానికి ఇంతసేపా" అని అనుకుంటుండగా..ఒక నల్ల గండు చీమలాంటి Sports bike మీద ఇద్దరోచ్చి ఆగారు .. ముందు కూర్చున్న అబ్బాయి కాన్ఫిడెంట్ గా , నేను డౌట్ గా "గురు!!..రఘు??" అని చూపుడు వేళ్ళు చూపించుకున్నాము .. నాకు matter అర్థమైంది .. 

"రా బ్రో ఎక్కు.." అన్నాడు 

"ఎక్కడెక్కనూ.." అన్నాను 

"వీడు దార్లో దిగిపోతాడు బ్రో ..నువ్వేక్కు" అన్నాడు .. 

ఆ bike ని చూస్తే నేల< బెంచి<బాల్కనీ అన్నట్టు మూడు heights లో ఉంది ..నాకు బెంచి offer చేశారు .. సరే ఏదో ఒకటిలే ముందు హోటల్ రూమ్ చేరితే చాలు అని ఎక్కా.. ఐదు సెకెన్స్ లో బండి speed అందుకుంది .... ఇక్కడ మనకి bench press మొదలైంది .. వామ్మో అదేం స్పీడూ.. ఏదో పాట కూడా పాడుతున్నాడు ..అమ్మాయిని ఎక్కించుకొని పోతున్న feeling వాడిది ,

అంబులెన్స్ లో పోతున్న feeling నాది ..

నా సెలైన్ నేనే పట్టుకునట్టు చేతి లో బాటిలోకటి , ఛి !! ..


" బ్రో how is our town బ్రో .." అన్నాడు  

"ఉ ఉ " అన్నాను..

"బ్రో , ఈ బేకరీ ఇక్కడ famous బ్రో , sandwitch సూపరుంటది..తింటావా బ్రో.."

" ఒద్దు. already అదే అవుతున్నాను.." 

" okay బ్రో , tomorrow డబుల్స్ వచ్చి తిందాం " అని gear మార్చి స్పీడ్ పెంచాడు ..


ఈ ఉత్కంఠ  నేను తట్టుకోలేను అని కళ్ళు మూసేసుకున్నా ..వాడు పోతూనే ఉన్నాడు.. చిత్ర విచిత్రంగా కదులుతోంది నా బాడీ,  అయినా కళ్ళు తెరవలేదు నా డెడికేషన్ అలాంటిది , కాసేపటికి బండి ఆగుతున్నట్టనిపించి తెరిచా.. నా మొకలికి మట్టంటింది .. వీడేదో రేస్ లో వంచినట్టు వంచుంటాడు బండిని ..నా వెనకవాడు లేడు .. దిగిపోయాడో పడిపోయాడో తెలీదు..బండి దిగేటప్పుడు చూసా, బైక్ వెనుక "Dad's Gift" అని ఉంది ..

"రఘు నువ్వు బైక్ ఇలా నడుపుతావ్ అని తెలిస్తే మీ dad ..bike నీ దగ్గర్నుంచి లాక్కుని .. "Dad's Gift taken back"అని రాయించుకొని ఆయనే వాడుకుంటారు .. తరువాత నీ ఇష్టం" అన్నాను

"..అయ్యో bike లేకపోతే కష్టం బ్రో" 

"కాళ్ళు చేతులు లేకపోతే కూడా కష్టం బ్రో" 

          

          ********************

" ...ఇదిగోండి సర్ keys " అని room number చెప్పింది receptionist  .... 

"hot water వస్తాయా అండీ .. " అడిగాను

"...హా సర్ .."  అంది 


రూమ్ ఓపెన్ చేసి చూసా .. నాలుగు మసి పట్టిన గోడలు ఒక  మంచం ఒక కిటికీ తప్ప ఏం లేవ్ ..కానీ AC ఉంది .. మన పక్కనున్న వాడికి జీడిపప్పు అంటే పడక  వాడి జీడిపప్పులన్నీ మన plate లో వేస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒక ఆగమ్యగోచర,అస్ఖలిత,అజరామరమైన feeling ఒకటి పొందాను ..

"ఆహా , ఇక hot water తో స్నానం చేసి AC on చేసుకొని పడుకుంటే యముడొచ్చినా లేపలేడు " అని అనుకోని గోడకున్న 

AC switch, ON చేశా ..ఎక్కడా remote లేదు , పోతే పోన్లే ఏసీ అయితే ON అయింది కదా అనుకున్నా .. చూస్తే అది 29 లో ఉంది .. అసలు ఎవడైనా AC 29 లో పెట్టుకుంటాడా?? .. బయటే 27 ఉంది కదరా.. room service కి phone చేద్దామని చూసా.. ల్యాండ్ లైన్ base unit ఉంది రిసీవర్ లేదు .. అవునులే ఇది రూమ్ అయితే కదా రూమ్ సర్వీస్ ఉండటానికి .. నేనే ఎక్కువ expect చేశా ..అని అనుకోని స్నానానికి వెళ్ళా .. నేను కాస్త తెలివైన వాడిని కాబట్టి అది  bathroom అని గెస్ చేశా మామూలోళ్ళకి కష్టం ..లోపల towel తగిలించటానికి ఏమి లేక మీదేసుకొనే స్నానం చెయ్యటానికి నిర్ణయించుకున్నా .. అక్కడ బకెట్ ఏంటో తెలుసా పెయింట్ వేయగా మిగిలిన medium size పెయింట్  డబ్బా... వెంటనే తెలిసిన ఇంకో విషయమేమంటే అదే మగ్గు కూడా ...నేనేం పాపం చేసానో , నాకీ ఖర్మేంటో అర్థం కావట్లేదు .. సరేలే అని అక్కడ రెండు taps కవల్లల్లా ఉంటే రెండూ తిప్పా..చాలా సేపు చూసా రెండిట్లోనూ చన్నీళ్లే వస్తున్నాయి .. ఇదేంటి అని, అటుగా వెళ్తున్న hotel తాలూకు అబ్బాయిని పిలిచా ..

"బాబు చూడు హాట్ వాటర్ రావట్లేదు" అని ఒక tap open చేసి చెయ్యి పెట్టి

"...చూడు చల్లగా వస్తున్నాయి" 

వెంటనే ఇంకో tap ఓపెన్ చేసి చెయ్యి పెట్టి 

"...ఇవి ఇంకా చల్లగా ఉన్నాయి, చూడు అస్సలు హాట్ వాటారే రావట్లేదు" అన్నాను.. 

"సర్ కొంచెం తక్కువ చల్లగా ఉన్నవే hot water సర్ .." అని వెళ్ళిపోయాడు ... నాకెందుకో  నేను చొక్కా చింపుకొని రోడ్లెమ్మట పరిగేడుతున్నట్టు అనిపించింది ..


         *********************

ఉదయం కాగానే లేచి ఆ బాత్రూమ్ లాంటి దాన్లో స్నానంలాంటిది చేసి ...రెడీ ఐయ్యి రెడీ గా ఉన్నా.. ఇంతలో రమేష్ గారు తలుపు తీసుకుంటూ లోపలికొచ్చి  

" సార్ good  morning.. ఏంటి సర్ మా రఘు driving కి బయపడ్డారంట " అన్నాడు పళ్ళికిలిస్తూ ..

"అలా drive చేస్తే bruce lee అయినా భయపడతాడు సర్ ,

అయినా ఏంటి సార్ room ఇలా ఉంది ?" అన్నాను ..

" low budget మూవీ అని చెప్పాక మీరు ఓకే అన్నాకే .." 

" నేను 'okay ఏసేయండి' అంటే మీరు ticket ఏస్తారనుకున్నా కానీ ..నన్నే ఏసేస్తారనుకోలేదు సర్ ..రిసీవింగ్ కి ఎక్కడైనా two wheeler లో డబుల్స్ వస్తారా సర్ ? , అసలు దీన్ని room అంటారా సర్ , అది fan ఆ సర్ ? ఒక రెక్కే ఉందేంటి సర్ ? ఎవడూ కనీసం చూసి కూడా ఉండడు సర్ ఇలాంటి ఫ్యాన్ ని, on చేస్తే గాలి సంగతి పక్కనపెట్టండి మట్టి రాల్తోంది సర్ .. ఇంక అది pillowనో లేక pillow కవరో అర్థం కావటానికి నాకు అయిదు నిముషాలు పట్టింది ..సర్ shooting కి వచినట్టు లేదు సర్ sucide కి వచ్చినట్టుంది , సర్ చేతబడి కూడా బొమ్మ కి చేస్తారు సర్ ..ఇక్కడ డైరెక్టు మనిషికే చేస్తున్నారు .. రాత్రి మోహం మీద ఏదో పాకింది .. అది నల్లో,బల్లో,పురగో,పామో తెలీక రాత్రంతా టెన్షన్ సర్ .... దోమలు మొహం మీద విపరీతంగా వాలుతుంటే ఆ నల్ల hit తీసి మోహం మీదంతా కొట్టుకున్నా సార్ frustration లో ..ఏమన్నా అయితే ఏంటి సార్ పరిస్థితీ ..అసలీ హోటల్ పేరేంటి సార్ "Raaja Hamsa Grandaa" ఏముంది సర్ ఇక్కడ గ్రాండ్ గా ... బాత్ రూమ్ లో flush నొక్కితే వాటర్ పడాలి కానీ ఫ్లష్ ట్యాంకే పడుతుందా సార్ ఎక్కడైనా, దాన్ని మళ్ళీ పెట్టలేక చచ్చాను ..ఇదేనా సర్ grand అంటే ...దీని పేరు రాజహంసా గ్రాండ్ కాదు  "రోజు హింస గ్రాండ్ " అని పెట్టాలి  !! రాత్రంతా ఏవేవో  ఎక్కడెక్కడికో వెళ్లి కుట్టాయి సార్ !! .."


" సర్ మీరు చాలా down to earth కదా మీరే ఇలా అంటే.." 


" down to earth ఏ సర్ , ఇంకా ఇలాగే ఉంటే inside the earth ఐపోయేలాఉన్నా .."


"sorry సర్.. .. మీకో  విష్యం చెప్పాలి..డైరెక్టర్ గారికి జ్వరం వొచ్చిందంట..అందుకని.." 


"డైరెక్టర్ గారికి జ్వరామోచిందా .. ఆయనకీ ఇలాంటి రూమే ఇచ్చారా .. "


"అవును సర్ .." 


"ఇలాంటి రూమ్ లో ఉంటే జ్వరమేంటి జాన్డీస్ ఒచ్చి జాంబీస్ గా మారిపోయినా ఆశ్చర్యం లేదు , కనీసం ఆయానకైనా మంచి రూమ్ ఇవచ్చుకద సార్ .." 


"అంటే అన్ని రూమ్స్ ఇలాగే ఉన్నాయి ..ఉన్న ఒక్క మంచి రూము సూర్యా గారికి ఇచ్చాను సార్ .." 


" సూరియా గారా ?? " షాక్ ఐయ్యి అడిగాను

"ఆయన కాదు, ఈన ఇంకో సూర్య గారు"

"తమ్ముడూ సినిమా లో ఉంటారు ఆ సూర్య గారా?" 

"కాదు సార్ , ఇంకో సూర్యా గారు.."

" శీలవతి సీరియల్ లో చేస్తారు? ఆ సూర్యా గారా?" 

" కాదు సార్, ఇంకో సూర్యా గారు" 

"ఎవరు సార్ ఆ సూర్యా గారూ .."

"మా బామ్మర్ది సర్ ..ఇదే ఫస్ట్ సినిమా.." 

"మీ బామ్మర్దా... ముందే చెప్పచ్చు గా సార్ .. నాకింతమంది సూర్యాగార్లు తెలుసని నాకిప్పుడే తెలిసింది .." అంటూ కాస్త normal ఐయ్యా .. 


"ఆ...అదే  సార్ , డైరెక్టర్ గారికి బాలేదు  కాబట్టి shooting cancel అయింది సర్ మీరు బయల్దేరచ్చు " అన్నాడు 


for the first time ..shooting cancel అనగానే 

ఒక అసంకల్పిత,అవాంఛిత,అఖండమైన అలౌకికానదం కలిగింది..


Bag సద్దుకుంటుంటే ఫోన్ మోగింది .. 

"హలో సార్ గోపి గారు, ఎలా ఉన్నారు .." అన్నాను

"మీరు మౌనంగా ఎదగటానికి ఒక chance ఒచ్చింది .. ఒక Low Budget Movie ఉంది చేస్తారా ..?" అన్నారు ..


నేను కళ్ళు పెద్దగా తెరిచి పళ్ళు కొరికాను .. 


Yours

Guru


Stay Home, Stay Safe !!

Now trending

Low Budget Movie

        Low Budget Movie ఐదారేళ్ళ కిందట ఫోన్ మోగితే  lift చేసి "హలో సార్ రమేష్ గారు, ఎలా ఉన్నారు ?" అన్నాను  "మౌనంగానే ఎదగమని...

Posts you may like