Monday, October 22, 2018

****


Lift అన్నట్టు చెయ్యి చూపించాను..నిదానంగా Scooty  ఆపింది , “ Hitech city దాక లిఫ్ట్ ఇస్తారా?” అని అడిగాను ..”కూర్చోండి” అన్నట్టు సైగ చేసింది , జాగ్రత్త గా  ఎక్కి కూర్చున్నాను, తనకి ఏ మాత్రం దగ్గరగా కూర్చోకుండా జాగ్రత్తపడ్డాను , సపోర్ట్ గా చేతులతో బండి వెనక పట్టుకున్నా...ఓక మాదిరి గా speed వెళ్తోంది ...నాకా కాలు ఎక్కడ పెట్టుకొవాలో అర్థంకావట్లేదు ...అరికాళ్ళతో foot rest  వెతుకుతున్నా, దొరికి ఛావట్లేదు ఒక్కటన్నా దొరక్కపోతుందా అని రెండు కాళ్ళతో ఒకేసారి వెతికా ..ఉహు దొరకట్లేదు ..మరీ లోపలి పెట్టాడు, తగుల్తోంది కాని ఓపెన్ అవ్వట్లా ...”ఏవండి కాస్త పక్కన ఆపుతారా ఫుట్ రెస్ట్ వెత్తుకుంటాను” అని అడిగితే ఎంత పరువు నష్టం ?? అందుకే అడగలా... వెతుకుతునట్టు తనకి తెలియకూడదు అది ఇక్కడ clause .. 
ఇలా అరికాళ్లతో ఇంకొంచెం సేపు వెతికానంటే ఎదురుగా వచ్చే వాళ్ళు చూస్తే నేను తనని ముందు కూర్చోబెట్టుకొని సైకిల్ తోక్కుతున్నానేమో అనుకుంటారు. Uuff !! అలుపొచ్చింది .. 
foot rest దొరక్క పోవటం తో అలా ఉండిపోయా....అందమైన అమ్మాయి Lift ఇవ్వటమే ఒక అందమైన అనుభూతి, ఎవడైనా అందులో ఓలలాడాలనుకుంటాడు ..అంతే కానీ ఇలా నాలా అదేదో కొండ చరియా నుంచి వేలాడుతున్నట్లుండాలనుకోడు , ఇక లాభం లేదు చర్యలు తీసుకోవాల్సిందే అని...బలం అంతా కుడి కాలిలో పెట్టి, నేను బాగా వెనక్కి వెళ్లి కాలుని ముందుకి పెట్టి  ..
ఫుట్ రెస్టో నేనో తేలిపోవాలి అని ఒక్క సారి మనసులో “విప్లవం వర్ధిల్లాలి” అని గట్టిగా అనుకోని ...మడిమ తో  foot rest ని ఒక్క తోపు తోసా...నలభై లో వెళ్తున్న బండి balance తప్పింది...తను ఉలిక్కి పడి sudden break వేసింది ...వెనక్కి వున్న నా తల, 500 మీటర్ల దూరం లో వున్న తన తల కి వున్న helmet కి తగిలింది. అదిరింది. జీవితం లో చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా గుర్తొచాయి..
“ఏమైంది ?? ..కాలు ?? అడగచ్చుగా ? .. కొంచెం ఉంటె ఇద్దరం పడేవాళ్ళం, బాగా గట్టిగా  తగిలిందా ?? !!అని  అడిగింది బండాపి.  
“హా పర్లేదులెండి ..” అన్నా ... 
“ఏంటి పర్లేదు?? helmet పెట్టుకున్ననాకే బాగా అదిరింది .. మీకు బానే తగి...అబ్బ swelling వచ్చేసింది” అంది టచ్ చేస్తూ .. 
"helmet పెట్టుకుంటే దెబ్బలు తగలవు అని చదివినట్టు గుర్తు" అన్నాను 
"అందుకే వెనక కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి అని అనేది" అంది 
"ఒహ్ ఔనా ఒక వేళ ట్రిపుల్స్ వెళ్తే అప్పుడు ముగ్గురూ  పెట్టుకోవాలా ?"అని అడిగాను  .. ఆ visual కొంచెం కొత్తగా అనిపించింది ఇద్దరికీ ... triple రైడింగే dangerous మళ్ళీ దాంట్లో safety !!! .. అదేదో రోడ్డు సైడ్ సోడా disposable glass లో తాగినట్టు .. "అందుకే ముగ్గురు వెళ్ళకూడదు అనేది ఐన మంచి చెబితే వినచ్చుగా " అంది ..."విన్నానండి బాబు ..ఈసారి కార్ drive చేసేటప్పుడు కూడా helmet పెట్టుకుంటాను ..ఒకే నా ?" అన్నా ...నవ్వుతూ ఎక్కండంది. 

"హబ్బా tension ఒచ్చేసింది నాకు , Thank God !! ఏమవ్వలేదు .." అంది 
"ఏం అవ్వలేదా ? " అని అనుకున్నా ,నా newly born bump ని touch చేస్తూ 
"Heey lets have something cold here and go no?" అంది ఎదురుగా వస్తున్న ఒక coffee shop లాంటిదాన్ని ని చూస్తూ 

                                  *******

" నాకు tension ఒస్తే వెంటనే ఏదో ఒకటి చల్లగా తాగెయ్యాలి లేకపోతే కష్టం , మీకు ఒక 20 min ok గా ? " menu  చూస్తూ , తల ఎత్తి అంది 
" am not in a hurry !! one veg sandwich for me " అన్నా 

ఓకే అని ఇద్దరికీ order చేసింది 

"అసలు normal గా నేను ఎవరికి lift ఇవ్వవను తెల్సా ,కొంచెం మీరు decent గా కనపడ్డారు ,ఎంత అవసరమో ఏంటో  అని ఇచ్చా, What do you do ? " అంది 
" I work for Microsoft " అన్నాను 
"ఓహ్  !! మరి ఇవ్వాళా office లేదా ? " అంది 
"leave పెట్టాను "
"మరి ఎక్కడికెళ్తున్నారు ?"
" ఏమో "
"ఏమో నా ...ఇందాక HItech city అన్నారు ? "
"ఏదో నోటికి వచ్చిందనేశాను "
"what ??" అంది 
"hahah .. sorry to surprise you ...actually, I have a habit of doing different things ..ఇవ్వాళ నేను అనుకున్నది cellphone,vallet,money,car ఏమి లేకుండా వీలైనంత దూరం వెళ్లి రావటం..so that I can score some interesting moments in life " అన్నాను 
అలా చూస్తూ ఉంది .
"... interesting yaa " అంది   
"Yeah !! for me its very interesting already .." తనని చూస్తూ అన్నాను 
నా  చూపు ని receive చేసుకొని  "... hahah .. hmm.. అయితే ఇప్పుడు మీ దగ్గర phone, money ఏం లేవా ?" అంది curious గా 
nothing అన్నట్టు గా చేతులు చూపించా .. 
"అంటే ఒక వేళా నేను మీకు lift ఇవ్వకపోయివుంటే ??? ...ఇంకొక్కళ్ళు ఇచ్చేవారు !!! ఎవ్వరూ ఇవ్వకపోతే ??...నడుస్తూ వెళ్లేవాళ్ళు !! " అంతేగా ?" అంది తానే question తానే answer ఇచ్చుకుంటూ 
"exactly !! కానీ మీకన్నా ముందు నేను రెండు 2 wheelers  వదిలేశాను "
"ఔనా , ఎందుకు ?"
"I did not find them interesting but you were interesting and attractive.. so...i have chosen you "
నాకు తను ఎలా కనపడుంటుందో అని నా వైపు నుంచి తనని తాను చూసుకున్నట్టుంది ... చిన్న smile ఇచ్చింది. 

"your order mam" అని మా ఆస్తులు మాకు పంచి పోయాడు 
నా sandwich మొహం చూసి "బాబు  ఇది fresh ఏనా ?? " అని అరిచి అడిగే ప్రయత్నం చేశా 
"its hot ..చుడండి పొగలు కూడా వస్తున్నాయ్ " అంది 
"చుడండీ ...మీరు కూడా hot గానే ఉన్నారు ,మీరేమన్నా ఇవ్వాళ పుట్టారా ? ఎప్పుడో పుట్టారు... ఎప్పటిదో sandwich వేడి చేసి ఇచ్చాడంతే " అని తల దించుకొని cut చేస్తున్నా ... ఏదో ఐయ్యేట్టటుంది .. interestingu  attractivuu వరకూ okay ఏదో example ఇవ్వబోయి  hot అని కూడా అనేసా ..అయినా ఈ మధ్య అందరూ కాస్త open గానే మాట్లాడుకుంటున్నారు కదా ... పర్లేదులే అని ..తల ఎత్తి చూసా .. 

"మీరు ఇలాగ different గా ఇంకేమేమి చేశారు " అంది ఏమి విననట్టు 

"hmm...  ..ఒక సారి నేను నా Harley Davidson bike side stand తీసి బయల్దేరబోతూ ఉన్నా ..పక్కనున్న ఆటో వాడు ..."బండి మస్తుందన్నా" అన్నాడు
"సరే , jublee hills road no.10 Star bucks coffee shop idea ఉందా ?" అన్నాను ..ఉందన్నాడు .."ఒచ్చేయ్!! " అని నా bike keys catch వేసాను .... అతను నా bike drive చేసుకుంటూ ఒచ్చాడు ,నేను తన auto drive  చేసుకుంటూ  వెళ్ళాను ... ఇద్దరికీ thrilling గా అనిపించింది ..ఇద్దరం reach ఐయ్యాక ఒకటే నవ్వులు !!

"wow !! It's amazing !! hahaha  మీకేమోగాని అతనికి భలే thrilling గా ఉండి ఉంటుంది "

"haa ..ఇంకా touch లో  unnaadu ... సార్ ఆ రోజు మిరే మీటర్ ఎసి,మీరే పైసల్ ఇచ్చుడు highlight సార్ అంటాడు ..hahaha " 

"... ఇంకోసారి restaurant లో తింటూ ఉన్నా ..server ని "ని favorite item ఒకటి తీసుకురా " అన్నాను ..తెచ్చాడు ..నేను కాస్త పక్కకు జరిగి .."దా కూర్చో ...ఇద్దరం తిందాం " అన్నా ...ఒద్దంటే ఒద్దన్నాడు .. మీ manager తో నేను మాట్లాడతానులే అని బతిమాలి ఒప్పించా తరవాత  ఇద్దరం తిన్నాం ..."ఇట్ల ఎవ్వరికీ జరగదు సార్ " అన్నాడు .. 

"ooh !! సూపర్ ... you made his day " అంది admiring గా  

"ఇలాంటివి చాలా చేస్తుంట ..... ఒక సారి online లో ఏదో order ఇచ్చా .. ఇంటికి deliver ఐయ్యాక return  ఇచ్చేసి  " its more than my expectation " అని reason ఇచ్చా ... వాడికి దిమ్మ తిరుగుంతుంది ..hhaha "

విపరీతం గా నవ్వేస్తోంది ... 

"అంతెందుకు మొన్న Microsoft interview లో కూడా "why you left your previous company " అని అడిగితే  "because it was so good !! " అన్నా 

నవ్వు తమాయించుకొని నన్నే చూస్తూ " you are full of life!! " అంది 
నేను ofcourse అన్నట్టు  కళ్ళు మూసుకొని కనుబొమ్మలెగరేసాను 

"anything else mam ? ... bill " అని అక్కడ పెట్టాడు ... 

నేను "I will pay " అని దాన్ని తీసుకోబోయాను ... 

"నో నో నో నో నో ...i will pay " అని తన purse open చేసి cash తియ్యబోయి ఆగి నన్ను చూసింది 

"నేను just formality కి అన్నాను, మిరే కట్టాలి  " అన్నాను నవ్వు face తొ 

scooty దగ్గరకు వచ్చాం

"మీ next variety task ఎంటీ ?"అంది  చాలా friendly గా  

నేను "in search of a soulmate"  అని ఒక novel రాస్తున్నా దానికి inspiration కోసం one whole day ఒక అమ్మాయి తో spend చేద్దాం అనుకుంటున్నా .. 

"ఎవరా అమ్మాయి ?" అంది చిన్న detachment తో 

"తెలీదు ..మీరు interested aa ?" అని అడిగా 

"hmmm... will let you know  give me your number " అంది phone తీస్తూ 

"ok. .. its double X, triple Y, double X, triple Y" అన్ని number ఇచ్చాను 

"ఓహ్  ... XXYYY-XXYYY ..fancy number !! ...చలో I will drop you and will go to my shift " అంది start చేస్తూ 

"no no .. నేను  lifts అడుగుతూ వెళ్ళిపోతా ..మీరు ఒక వేళ interested కాకపోతే నేను ఇంకో అమ్మాయిని వెతుక్కోవాలి కదా ?!! "

"ఓకే ..కాస్త helmet పెట్టుకోని అమ్మాయిని చూసి lift అడగండి .. మీకు already దెబ్బ తగిలింది " అంది కొంచెం కేరింగ్ గా కొంచెం వెటకారం గా 

"hahah  sure ..!! " అన్నాను 

"ఫోన్ కాస్త దగ్గరే పెట్టుకోండి " అంది 

"ఎందుకు ?" అన్నాను 

"ఏమో ఎవరన్నా ఫోన్ చేస్తారేమో " అంటూ move అయింది 

"అయ్యో మీ పేరే చెప్పలేదు ? " అన్నా కాస్త గట్టిగా 

బండి ఆపి పేరు చెప్పింది. 

yours
Guru

Now trending

Low Budget Movie

        Low Budget Movie ఐదారేళ్ళ కిందట ఫోన్ మోగితే  lift చేసి "హలో సార్ రమేష్ గారు, ఎలా ఉన్నారు ?" అన్నాను  "మౌనంగానే ఎదగమని...

Posts you may like