Tuesday, August 31, 2010

kalaaఖండం --- Unbelievable Journey

                                         వడివడిగా నడుస్తున్నాను…ఇంక పది నిముషాలే వుంది….road అంతా white wash చేసినట్టు వెన్నెల కురుస్తోంది ..!! అప్పుడప్పుడూ చెట్ల ఆకులనీడలు నామొహం మీద నుంచి వెళ్లిపోతూవున్నాయి…భుజానికి వున్న bag ని బొటన వేలితో ఎగేసుకుంటూ నడుస్తున్నాను ..నుదుటి మీద చిరు చెమటని చూపుడు వేలితో తుడిచి,చిటికేసాను ….ఒక మూడు బస్సుల దూరంలో, ఎక్కాల్సిన బస్సు పొగ వదులుతూ కనపడింది ,బస్సు తన ఆఖరి క్షణాల్లో ఉన్నట్టు గ్రహించాను , వెంటనే pant జేబులో నుంచి ticket తీసి , ఒక చేత్తో open చేసిbus number Match చేయటానికి try చేస్తున్నాను ..నా నడక వల్ల ticket మీద number shake అవుతోంది Clear గా కనపడట్లేదు …ఇంతలో నా పక్కనుంచి ఒక car నన్ను over take చేసి వెళ్ళింది …Dinosaur అరిచిన sound తో car ఆగింది …అటు చూసాను …Skoda Car …నాకు matter అర్థమైంది .. మళ్లీ ticket లోకి తొంగి చూస్తున్నాను …window లో నుంచి నడుం వరకు బయటకి వచ్చి “రేయ్ గురూ…” అని అరిచాడు పూర్ణాగాడు …! వాడిని పట్టించుకోకుండా బస్సు entrance వైపు వెళ్ళిపోయాను ..! బస్సు door ఎక్కబోతూ వుండగా .. పూర్ణాగాడు దూసుకొచ్చాడు …”సారీ రా ..night party కి అన్నీ ready చేసి , Daddy ని party office దగ్గర drop చేసి వచ్చేసరికి O 5 mins late అయింది ..!! అనవసరంగా నిన్ను Moon walk చేయించాను …Am sorry ” అన్నాడు ..నేను “…its oke ” అనే లోగానే …”అన్నీ పెట్టుకున్నావా? …Mobile ?…Wallet? ” అన్నాడు .. నేను నా pant left back pocket ని , right back pocket ని తడిమి,తలాడించాను…”…Mobile charger ?? ” అన్నాడు …భుజం తో , ఏసుకున్న bag ని ఎగరేసాను, “gud..” అన్నాడు ..! ..మా మధ్య నుంచి ఒకడు బస్సు లోకి వెళ్ళాడు హడావుడిగా .....” కాస్త నోరు తెరిచి మాట్లాడు బాబు ..కోపం చాలు గానీ  …” అన్నాడు …నేను chill అయిన విషయం వాడికింకా అర్థంకాలేదు అని అర్థంచేసుకొని …చిన్న కోపం కొని తెచ్చుకొని .”నీకు ఇది అలావాటు ఐపోతోంది …ఇంకోసారి ఇలా late చేసావనుకో …నువ్వు శిశుపాలుడు అవ్వటమే కాకుండా నన్ను శ్రీ కృష్ణుడిని చేసిన వాడివి అవుతావ్ ” అని అంటూ వుండగా ఇందాక లోపలికెళ్ళిన వాడు మళ్లీ మా ఇద్దరి గుండా బయటకొచ్చాడు ……” చెయ్యను గాక చెయ్యను …అయినా నిన్ను కొత్త గా శ్రీకృష్ణుడిని నేను చేసేదేముంది ..తమరు already..…..” …అసలే నాకు పొగడ్తలంటే చాల ఇష్టం ..వాడు అలా అనే పాటికి …control చేసుకుంటూనే పూర్తి స్థాయి smile ఇచ్చాను ..! “….uuu silly boy ” అంటూ వాడి ముక్కును అలా అన్నాను …! “అది సరే ఎక్కడికెళ్ళినా గంగిరెద్దు మెడలో గంటల్లాగా …ఈ ear phones ఏంట్రా ? ” అని నా shirt లో నుండి hang అవుతున్న ear phones చెంపల్ని యెడా పెడా వాయించాడు …!!ఇంతకముందు లోపలికీ బయటకీ తిరిగిన అబ్బాయి వచ్చి “saar పోయేదే సార్..!! ” అన్నాడు …
 “సరేరా మరీ…Call చేస్తా …మన రమేష్ గాడు నిన్ను receive చేసుకోవటం కోసమే leave పెట్టాడట ..నువ్ జాగర్తా…” అంటూ భాదంతా చేతిలో పెట్టుకొని బరువుగా చేయ్యుపాడు ..బస్సు రెండించీలు కదిలింది …oke రా see u byeee..నువ్ పో ఇంకా ..” అని లోపలికి step in అయ్యాను ..Full గా Ac on లో వుంది ఆ చల్లదనానికి నా మొహం మీద వున్న బాల చేమటంతా అలా చెర్మంలోకి ఇంకినట్టు అనిపించింది …ఒక్క క్షణం ఆ హయిని అనుభవించి బరువుగా కళ్ళుతెరిచి …చిన్నగా లోపలికి వెళ్లి నా seat number 16 ఎక్కడ వుందా …? అని ఇరు వైపులా వున్న అటకల్ని చూస్తూ మెల్లిగా ముందుకువెళ్తున్నాను…… కాస్త ముందు , నాకు left లో 15W పక్కనే మన 16 కనపడింది …seat కి కళ్ళతో haai చెప్పి కుర్చూబోయాను …! “saar ticket చూపెట్టండి saar” అన్నాడు, ….ఏంటి బాబు … game అయిపోతున్న Carrom board లో coins లాగా , అలా విసిరేసినట్టు ఉన్నారే జనాలు ..? ” అన్నాను ticket ని చేతికి ఇస్తూ…వర్షాకాలం గదా saar..Ac fill అయితలేదు ” అన్నాడు …ticket మీద tick ఏసి చేతికిస్తూ …!! ..“O అలా అంటావా …సరే గాని ఇంత slow గా పోతే కష్టం …బస్సు , breaks fail అయిన బండిలా దూసుకుపోవాలి….చెప్పు కాస్త ” అని ear phones చెవిలో పెట్టుకొని pant లో వున్న play button నొక్కి ఇటు తిరిగా….అంతే ..! చూపు మరల్చలేకపోయా …చూడద్దంటున్నా చూస్తూనే ఉంటా ~~ ..నా కోసం ఇంతందంగా పుట్టావ్ అనుకుంటా …” అనే పాట play అవుతోంది చెవిలో …ఆ audio కి perfect visual మాది ..!! ఇంకాసేపు అలానే చూస్తే ఆ అమ్మాయి ఇబ్బంది feel అవుతుంది అని ..చూపు తిప్పేసాను …! తలకి మత్తు సూది ఏసినట్టుంది నా పరిస్థితి … Ear phones తీసేసి ..నా seat లో కూలబడ్డాను …తన face, colour Xerox copy ఒకటి నా కళ్ళ ముందు ఉండిపోయింది , బొట్టు లేకపోయినా ఇంతటి అందం సాధ్యం అన్న విషయం నాకు అప్పుడే తెలిసింది …అంతా అందమైన మొహం లో కేవలం ఒకే ఒక్క మొటిమ చోటు దకించుకొని నేను సైతం అంటూ తన అందానికి ఆజ్యం పోస్తోంది … ఇంత అందమైన అమ్మాయి ,నేను travel చేసే బస్సులో వుండటమేంటీ,ఉండెను పో..తన seat నా seat ముందే వుండటమేంటీ…ఉండెను పో …..నేను ఆమెని చూసినప్పుడు ఆ situational song నన్ను ఉత్సాహపరచటం ఏంటి? ….పరిచెను పో….!!! ఒక అమ్మాయి నాకు తృటిలో నచ్చటం ఏంటి ?అంతేకాక నేను ఈ range లో disturb అవ్వటం ఏంటి ?…ఇంతకముందు ఎవర్ని చూసిన నాలో ఇన్ని vibrations రాలేదే …!! అసలే Love at first sight మీద నమ్మకం లేని వాడిని ….!! అమ్మో singal take లో చాల ఆలోచిస్తున్నాను …..divert చేసుకోవాలి ” అని అనుకోని …కనుబొమ్మలు ఎగరేసి తల విదిల్చుకోని ear phones చెవిలో పెట్టుకున్నా 
ఇంత మంది ముందుకొచ్చి అందాలు చెల్లుతున్న ఈ గుండెకేమవ్వలా …అరె నిన్న గాక మొన్న వచ్చి ఏమాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా….O సోన …” అనే song వస్తూంది …..ఉలిక్కిపడి నిట్టారుగా కూర్చున్నాను …
  ఇదెక్కడి co-incidence రా బాబు …” అనుకుంటూ , పాడుతున్న earphones ని drop చేసాను … సోన seat వైపు చూసాను ….(she is named after that song)…తల మాత్రామే కనపడుతోంది …..ఇక నేను , తను పెట్టుకున్న Red clip ” లోనే తనని చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాను …ఈ హడావుడి లో నేను నా seat లో సరిగ్గా settle అవ్వలేదని గుర్తొచ్చింది …bag పక్క seat లో పారేసాను …push back మరీ ఎక్కువ గా వుంది ..ఏదో stretcher లో పడుకున్నట్టు వుంది …కాస్త ముందుకు లాక్కుందాం అని ..నన్ను నేను ముందుకు pull చేసుకోవటానికి ముందు seat side ని పట్టుకుని లేవబోయాను … లేస్తూ వున్నాను …correct గా అదే time కి తను వెనక్కి ఆనుకుంది …!! Sappp!! అని చెయ్యి తీసి ముందుకు పడ్డా …తను seat boarder నుంచి మొహం 65 % పక్కకు పెట్టి, ….. am sorry..!!! ” అంది …. నేను కంగారుగా .. Pa..pleasure is mine..” అన్నాను …తను slight గా నవ్వి seat లోకి వెళ్లిపోయింది…నేను తేరుకొని ఛి ఛి నేను ఇప్పుడు ఎమన్నాను …?? Pleasure is mine aa?? కంగారు లో vocal chords కి ఏం ఒస్తే అది వాగేసా …ఛి …ఇంక నయం pleasure is “Main” అనలేదు …అని నా చెయ్యిని చూసుకున్నా … అది ఏదో లోకం లో వుంది …తన్మయత్వంలో వుంది ….నేను కూడా ఒక్క సారి ఆ మధుర క్షణాలను తల్చుకున్నాను ..ఆహా ..what a sweet collision it was…..ఆషాడం offer లాగా last లో  “aaaa” కళ్ళతో నవ్వు …hmmm…అని నిట్టూరుస్తూ కిందకు చూసాను …నా ear phones కనపడ్డాయి …! ఈ సారి ఏం పాట వస్తుందో ..అని ఆత్రుతగా చెవుల్లో పెట్టుకున్నా … ఇదేదో తెలిసిన Music లా వుందే ??.. ” అనుకుంటూ వుండగా …“….. అందమైన ప్రేమ రాణి , చేయి తగిలితే సత్తు రేకుకుడా స్వర్ణమే లే ( ఇక్కడ నా చెయ్యి చూసుకున్నాను )..అందమైన ప్రేమ రాణి లేత బుగ్గ పై చిన్న మొటిమ కూడా ముత్యమే లే …”.. అని వస్తూంది…. Finishhh..!! ఐపోయింది నా మైండు పాడైపొయింది…. ఇక్కడ జరుగుతోందంతా చూసినట్టు పాడుతోంది ???…మొటిమ గురించి కూడా correct గా చెప్పింది ..?? ఇది ” i-pod ” aaa ?? లేక ” Eye-pod ” aaa??  ఏం పాడో ..! అనుకోని …ear phones drop చేసి … మెల్లి గా సోన red clip వైపు చూసా ..చూసి, ….పొడవు జేడ వుండి ఉండచ్చు ..” అనుకుంటూ వున్నాను …ఇంత లో ఆ red clip కాస్తా  black clip అయింది …నా romantic mood కి తోడు బస్సు లో lights తీసేశారు ..ఇలా జరిగిందేంటి ??…అసలు బయట ఏం జరుగుతోంది అని Curten అంతా ఒక పక్కకు gather చేసి చూసా …full moon!! ..walk చేస్తూ మా బస్సు వెంటే వస్తున్నాడు …చుట్టూ , సూర్యుడు కూడా రావటానికి భయపడెంత చీకటి ….పసి పాప మనసులాంటి నిష్కల్మషమైన రోడ్డు …అప్పుడప్పుడూ ఒంపులు…చుట్టూ కొండలు .. వీటి మధ్య మా బస్సు రెండు powerfull hi-beam light focus లతో దూసుకుపోతోంది … చంద్రుడి point of view లో చూస్తే …మా బస్సు ఆ చీకట్లో , సడి చప్పుడూ లేకుండా అలా వెళ్తూ ఉండుంటుంది …సోన అంత కాకపోయినా …. ఆ view కూడా బానే ఉండచ్చనిపించింది   “hmmmm…ఏంటో ఈ కొత్త కొత్త వర్ణనలూ ,పొలికలూ ..నాకే కొత్తగా అనిపిస్తున్నాయి …” అని గొణుక్కుంటూ curten వదిలేసి మళ్లీ నా position కి నేను వచ్చేసాను …..ear phones swing అవుతున్నాయి …. DIG DIG …DIG DIG అని నా heart beat sound వినపడుతోంది …. ఏమైతే అదిఅయింది అని చెవుల్లో పెట్టుకున్నా ….. “ Hey సోన వెన్నెల Sonaaaa~~ నిను చేరగ raanaa…నీ సొగసే కవితై కీర్తనలే ~~ నే ~~ పాడేవేళ …O hyper tension తలకెక్కీ~~ఆడేసేయినా …” అని వస్తోంది …. Ooh!! MY GODDD!!! This is heights of yemotion…నేను ఏదో fly లో ” సోన ” అని పేరు పెడితే అది కూడా వినేసింది …బయట full moon గురించి నేను మనసులో అనుకున్న మాటలు కూడా వినేసి … వెన్నెల , కవిత , కీర్తన అంటోంది …. ఆఖరికి నేను చెవిలో ear phones పెట్టుకునే ముందు పడ్డ tension కూడా పసిగాట్టేసి “O hyper tension తలకేక్కీ” ….అంటూ పాడుతోంది …సందేహం లేదు …నాకర్థమైపోయింది…మొన్న ఆలీబాబా కి అబ్ధుతదీపం …నిన్న యమలీల లో అలీ కి భవిష్యవాణి …నేడు, నాకు ఈ Eye-pod…!!! …. అని అనుకుంటూ ear phones రాల్చేసి..వెనక్కి పడ్డా ..పడి పక్క seat కి సంబంధించిన blanket నా మొహాన ఏసుకున్నా ….ఒక ఐదు నిముషాల తరవాతా …” అవునూ?? తనేంచేస్తోందో ?” అని లేచి జిరాఫీ లాగా గొంతు సాగదీసి ఏటవాలుగా చూసా …చక్రం తిప్పుతోంది , తన i-pod ది,  …aaa I pod lighting లో ఇంకా అందంగా కనపడుతోంది తను ….నేను ఎందుకనో ఒక సారి curten జరిపి బయటకి చూసా …వేడి వేడి గా వర్షం పడుతోంది ….నాకు పిచ్చెక్కినట్టు అనిపించింది …కాని నాకు ఆ పిచ్చి చాల comfortable గా వుంది …! నేను కూడా చక్రం తిప్పాల్సిందే అనుకోని ….నా తక్షణ కర్తవ్యం ఏంటా అని ఆలోచించాను .. point number one..తను మేలుకొని వుంది ….Point number two నేనూ మేలుకొని వున్నాను …point number three అందరూ పడుకొని వున్నారు ..మాట్లాడడానికి ఇంత కన్నా మంచి chance రాదూ …Point number four తన చెవిలో ear phones వున్నాయి కాబట్టి … పిలిస్తే వినపడదు …..So కచ్చితం గా తాకాలి …!!!!….aaa Last point చాలా motivational గా వుంది ..!! నేను నా right hand వాడలేను So మళ్లీ aa అవకాశం నా ఎడమ చేయ్యికే దక్కింది …నా చెయ్యి కి good luck చెప్పి రెండు సార్లు దువ్వి .. పంపించాను …seat thickness దాటం గానే తన భుజం వుంది …నా చెయ్యి మెల్లి గా progress అయింది …ఇంకాస్త ముందుకు వెళ్తే తన భుజం తగులుతుందనగా….
…..ఒకసారి నాకు ear phones పెట్టుకోవాలనిపించింది “….okee ” అనుకొని ..మెల్లిగా రెండు చెవులలో పెట్టుకున్నాను …. అందులో ఏ song వస్తోందంటే …“..ఏకాంత వేళా aa aa aa aa aa aa …..ఏకాంత సేవా aa aa aa aa aaa…నీ కొంటె గోల aa aa aa aa aa aa …రేపిందీజ్వాలా aa aa aa aa aa…ఏం చేయమంటావు నాక్కూడా కొత్తే కదా aa aa aa aa aaa……ఊ కొట్టమంటాను ఇంకాస్త సరికొత్తగా aa aa aa aa aa aa …” అని song run అవుతోంది …ఇంక ఆలస్యం చేయలేదు …మెల్లిగా తన left భుజం touch చేయబోయాను …..కాళ్ల దగ్గర ఏదో పడ్డట్టు అయిందేమో..తను ముందుకు వెళ్ళింది …నేను CHA…అని ఆ seat నీ పట్టుకున్న ..తను వెనక్కు ఆనుకుంది …ఒక్కసారి  ” …haaaah !! ” అని ఉపిరి పీల్చాను …ఈ సారి ధైర్యానంతా కూడాగట్టుకొని చెయ్యి వెనక్కు తీయలేదు …విచిత్రంగా తను కూడా ముందుకు వెళ్ళలేదు ….2 secs అయింది …ఇంకా అలాగే వుంది ….నేనూ తియ్యలేదు ..తను ముందుకి వెళ్ళలేదు ….తియ్యలేదు … వెళ్ళలేదు …నేనూ ఈ లోకం లో లేను …అలవాటు లేని సుఖం అలవాటు అవుతోంది ….తను ముందుకి వెళ్ళాక పోవటమే కాక ఇంకా బలంగా ఆనుకుంటోంది…abboo సరసం కూడా ….అనుకుంటున్నా …నా అదృష్టానికి ఆనందపడుతూ time waste చేయకుండా జరగాల్సింది చూడాలి అనుకున్నా ….Correct గా అదే time కి నా back pocket vibrate అవుతోంది …left back pocket లో వుంది నా cell phone….మూడు సార్లు vibrate అయ్యాక ringtone వస్తుంది …ఇక్కడేమో మంచి రసపట్టు ….అప్పుడే ఒక vibration అయిపోయింది ….నా చెయ్యిని నేనూ ..
” ఇక వెళ్ళాలి ” అన్నట్టు వెనక్కి కదిల్చాను ….” ఏంటి తేసేస్తున్నావ్ ??” అన్నట్టు కాస్త ముందుకు జరిగింది …!! అప్పటికే నా cell phone laast time vibrate అవుతూవుంది …. TAKK!! మని lift చేసి ” ఎవరు ?? ” అన్నా విసుగ్గా…!! “…ఏరా? … ఇంకా పడుకోలేదా ?? ” అన్నాడు పూర్ణాగాడు ” అరేయ్ నువ్వు ఎలాంటి time లో call చేసావో నీకు అర్థం అవుతోందా ?? ” అన్నాను పళ్ళు బిగబట్టి...... ” అదేంట్రా నేను call చేస్తా అని చెప్పాను కదా ? అందుకనే చేసాను ”
“aaaaha….మాట కి ఇంతగా కట్టుబడి వుండే మనిషివి అని తెలీదురా …నీ యబ్బ !….సర్వనాశనం చేసావ్ ఛి …” వాడి పీకని ఉహించుకుంటూ ..phone పీక నొక్కిపడేసాను…
” habbaaa ఇప్పుడు మళ్లీ మొదలెడితే బాగోదు …అది అలా జరిగిపోవాలంతే ..” అనుకుంటూ అలా వీపు seat కి ఆనిచ్చా …


” వాసి పేట్ …వాసి పేట్ ” అనే అరుపు వినపడింది …. Takk మని కళ్ళు తెరిచా ..తెరిచినా ఏం కనపడలేదు ..ఉక్కిరిబిక్కిరి ఐయ్యి చేతులతో గాల్లో ఎగబాకాను… మొహం మీద నుంచి దుప్పటి నా జుట్టుని ముందుకేస్తూ వచ్చేసింది , చూస్తే భళ్ళున తెల్లారింది …అటు చూసా red clip అప్పుడే లేచేసింది ..అటు ఇటు కదుల్తోంది …” Bakary Circle!!! ” అని గావుకేక పెట్టాడు … జుట్టు ని గబగబా set చేసుకొని bag తీసుకొని సోన seat ని దాటి వెళ్లాను ..వెనక్కు తిరిగి సోనా ని చూడాలంటే కొంచెం నాముషి అనిపించింది …ఒక్క సెకన్ అలా ఆగి ముందుకు వెళ్ళిపోయాను …రాత్రి పడుకొనే ముందు నేను దుప్పటి మొహం మీద వేసుకోలేదు ..ఉదయానికి నా మొహం మీద దుప్పటి వుంది ..అది ఎలా ..?మధ్యలో ఏమైనా కప్పుకున్నానా ? లేక కల ఏమైనా కన్నానా ??ఒక వేళ కనుంటే ఎక్కడిదాకా నిజం ఎక్కడినుంచి కలా ?? అనే విషయం నాకు అర్థం కావట్లేదు …అసలే నాకు fantasies చాలా ఎక్కువా …దీనికి సాక్షం ఎవ్వరూ లేరు ..ఒక్క నేను సోనా తప్ప …అసలు సాక్షాలు వుంటే ఇలాంటివి చెయ్యనే చెయ్యము ..! నాకంతా mixing mixing గా వుంది … తేరుకునే టప్పటికి నేను బస్సు దిగేసాను ..Ramesh గాడు Car keeys వున్న చేత్తో shakehand ఇస్తూ …Haaai రా గురూ …ఎలా వున్నావ్ …రాత్రి నిద్ర బా పట్టిందా ?” అన్నాడు …ఆలోచిస్తూనే వాడివైపు చూసి “….పట్టినట్టే వుంది ” అని Car వైపు వెళ్ళిపోయా …ఆలోచిస్తూనే వున్నా .. ఒకవేళ అది కలే అయితే ..అంతకన్నా పెద్ద disappointment ఉండదు ..” అని అనుకుంటూ వున్నా …Car వెళ్తూనే వుంది…”Areeey !!! ఏంట్రా ?? ఏం ఆలోచిస్తున్నావ్ ..? కళ్ళు ఏంటి అలా వున్నాయ్ ..రాత్రి నిద్రలేనట్టుందే ..” అన్నాడు ..Sure గా లేనట్టుందా ?” active గా అడిగాను …అదేంట్రా  నీకే  కదా తెలియాలి ..face చూస్తే లేనట్టే అనిపిస్తోంది ”…అని మొహం road వైపు తిప్పి …steering తిప్పుతున్నాడు ….నాకు కొంచెం జోషొచ్చింది…!!
“ Car కొన్నా అన్నావ్ ఇదేనా ?…. బాగుంది రా …abboo Music player కూడా నా ..? ” అన్నాను car చూస్తూ చూస్తూ Music player దగ్గర ఆగి …నా వెలికి Play button కనపడింది …పుసుక్కున నొక్కా …”Kalayaaaaaa~ nijamaaaaaa~ తొలి రేయి haayi mahimaaa ~~~” అనే పాటా play అయింది …. మళ్లీ ఆలోచనలో పడ్డా … కచ్చితంగా కల అయివుండదనిపిస్తోంది…sudden గా నాకు
పూర్ణాగాడు  గుర్తొచ్చాడు …పాట stop చేసి ..ఆ పాట పక్కనే వున్న ramesh cell phone ని తీస్కొని.. పూర్ణాగాడి  number కొట్టాను … “ తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగరా ..దేశమాత స్వేఛ్చ కోరి తిరుగుబాటు చెయ్యరా …” అని ఒక 10 times వచ్చింది …!!
“దేశం లో వున్న తెలుగు వీరులందరూ లేచినా వీడూ మాత్రం లేవడు..” అన్నాడు ramesh గాడు …!! ….


“….Room చూసి కంగారు పడకూ …” అంటూ gate keech న తెరిచాడు …____ \___ .. hall లోకి entre అయ్యాము… “ ఇతనే రా నా room mate నేను ఇందాక చెప్పానే …” అని పరిచయం చేసాడు … ….haaai” ani కష్టపడి standing ovation ఇచ్చి చెయ్యి కలిపి ఇబ్బంది గా నవ్వాడు ……తరవాత నేను కూడా quick గా ఇబ్బంది పడి ..speed గా ramesh room లోకెళ్ళి, రంధ్రాలు అన్వేషించి ..eye pod charging కి పెట్టాను …aa తరవాత every 10mins కి పూర్ణా కి call try చేస్తూనే వున్నాను …వునట్టుండి నా  కడుపు లో వున్న ఎలుకలు alarm మోగించాయి.." అప్పుడే Lunch Time అయిందా , సరే snooze నొక్కుదాం " అని kitchen లోకి వెళ్ళా …o ఐదు నిముషాలకి … “ aareey….పూర్ణా calling… మాట్లాడు ” అని పరుగున వచ్చి phone ఇచ్చాడు ramesh…నా hello తరవాత ..ఏరా…గురూ గాడు వచ్చాడా ? ”
“haa receive చేసుకున్నాడు …”
“ooh!! గురూ నువ్వా ?…ఏరా ప్రయాణం బాగా జరిగిందా ??” అన్నాడు semi నిద్ర గొంతు తో …
అది తెలీకే సస్తున్నా నాయన… ”
“అవునా .! ఏమైంది రా …”
“సరే ముందు ఇది చెప్పు …నిన్న night నువ్వు నాకు ఒకటిన్నారా రెండు ఆ ప్రాంతం లో ఏమైనా call చేసావా ?? ” ..
నిన్న nightuuu ??…ఏమో రా తెలీదు ..నిన్న night party కదా full గా తాగి తూలాము …నాలుగు దాకా అంతా ఇక్కడే వున్నారు…అయినా నిన్న night నా cell నా దగ్గర లేదు విస్సు గాడు పట్టుకుపోయి వాడి మాజీ కి call చేసి కన్నీళ్లు కారుస్తూ ఛాలెంజ్ లేవో చేస్తుండే.! …కాని నా అలవాటు ప్రకారం నీకు ఏదో ఒక phone నుంచి call చేసినట్టే వున్నాను రా …but am not sure..అయినా.. ? నీ cell phone లో చూసుకోవచ్చు కదా ?? ”
ఏడిసావ్ లే …ఆ మాత్రం తెలీకనే ఇన్ని projects చేసుంటాన ..?? నా cell phone display పగిలిపోయింది ..గుర్తులేదా ??” …
oo అవును కదూ…!!! ఇంతకీ matter ఏంటి ? ” ….
“areey నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు …July 26th Wednesday , KCVSR travels,KPHB Road No.1 bus stop, Seat number 12 aisle … Age 22 to 24 , female … ఈ passenger full details నాకు exact గా  half an hour lo కావాలి ..come on ..Quick..!! “ అని అన్నాను ..సరే అని కూడా అనకుండా phone పెట్టేసాడు…

Operation theater లోకి delivery కి వెళ్ళిన భార్య కోసం worry అయ్యే భర్తలాగా ..అటు ఇటు తెగ తిరిగేస్తున్నా … మధ్య మధ్య లో Rithik roshan మొహం మీద గుద్దుతున్నాను…వాడు fan కదా poster ఒకటి తగిలించుకున్నాడు room లో ….

Cell ring అయింది ..ఏరా దొరికిందా ??” అన్నాను …

… arey …..Age: 23…height: 5’5″…Fav colour: Red, College:Villa mery, Native place: Hyd,Cast: beeeep , Phone number: 9959881882, పేరు : శ్రావణి, ముద్దు పేరు : Sona….అది matteruu ..ఈ F I R సరిపోద్దా sir ? ”
“ఏంటి?? పేరు Sonaaa నా ?? నేను ఇంతముందు details ఇస్తున్నప్పుడు నీకు ఈ పేరు ఏమైనా చెప్పానా ?….”
నువ్వు చెప్పటమేంట్రా …అంత కష్టపడి నేను collect చేస్తే …”
oke thanks రా .. U are the best …” అని phone పెట్టేసాను ….పేరు కూడా match అవ్వటం ఏంటి …ఎంత twistlu అలవాటైపోతే మాత్రం మళ్లీ twistaa??…ఇన్ని twistlu Race cinema లో కూడా లేవు ….పేకాట లో పన్నెండు jokerlu వచ్చినంత thrilling గా వుంది …ఈ స్థితి లో స్థితప్రజ్ఞత చాలా అవసరం అని ..ఉబుకుతున్న ఉత్సాహాన్ని కష్టబడి curtail చేసుకున్న ….ఒక నిముషం తరవాత Call చేద్దాం అనుకున్నాను కాని sms is good to start with అని …మూడు నాలుగు లైన్లు type చేసి erase చేసి చివరికి “ hello…yela vunnaru… ” అనే message ని oke చేసి successful గా పంపాను ….. అసలు ఈ details correctoo కాదో …ఇది ఎవరికి వెళ్లిందో ఏమో …చూసుకుంటుందో లేదో ..reply చేస్తుందో లేదో ..reply ఇచ్చినా ఎలా ఇస్తుందో …. ఇలా Mind full of thoughts తో brain బరువెక్కింది … 2 mins కి SMS వచ్చింది అదే number నుంచి..

“ fine!! Return journey yeppudu?? ;) ” అని వుంది …!!!! Twistla పరంపర కొనసాగుతోంది …
అదృష్టం handle చెయ్యలేక ఆత్మహత్య చేసుకున్న యువకుడు ” అనే headline నాకు నచ్చలేదు …అసలు ఏం జరుగుతోందక్కడా? What a day it has been… ఆ confidence ఏంటి ..ఈ frequency ఏంటి ..? అని ఏం చెయ్యాలో అర్థంకాక వెంటనే ..పరుగు పరుగున వెళ్లి నా Eye pod ని on చేసి phones చేవిలోపెట్టుకున్నాను … “Halele halele halele halele halele haleleleee yee!!!~~~ Americaa నే NRI లా yeelinattundheeee~~ అది go… ఇది goo… ఎటు చూసిన వన్నెల fiancée…ayoooo aayayooo రారమ్మని ఇచ్చెను signalseee…గుండెలలో పండగలే yinaadeeee…..Happy day..~~~ Happy dayyy~~~”…అని ఇట్లు శ్రావణి గురుచరణ్ అనే cinemaaloo … Sorryy…! ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే cinema లో పాట వస్తోంది …..yaahoooo అని గట్టిగా mute లో అరిచాను ….!! అమ్మాయిని కలవగానే ఆ రోజు రాత్రి ఎక్కడిదాకా జరిగిందో ఎలా అడగాలి అన్న విషయం ఆలోచిస్తూ వుండగా ramesh గాడు వచ్చి
“ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు” అన్నాడు …
నవ్వు మొహం తో తల ఎత్తి ..” reei నీ జన్మ లో ఎప్పుడైనా 7 star hotel లో లంచ్ చేస్తావ్ అనుకున్నావా ? “
“hmmmm?….లేదు ? ఏం ? “
“బట్టలేస్కో..!” అని చిరంజీవి  లాగ  confident గా  సిగ్గు  పడుతూ  పక్కకోచ్చేసా … వాడు మాత్రం నోరు తెరుచుకున్న కళ్ళతో అలా చూస్తూ వుండిపోయాడు …

కమాస్క్రీద,
Gurucharan Sharwany 
(కమాస్క్రీ ద అంటే థ, మాటలు, స్క్రీన్ ప్లే, ర్శకత్వం అని అర్థం చేసుకొని మెచ్చుకోగలరు )

you are welcome… !!

Now trending

Low Budget Movie

        Low Budget Movie ఐదారేళ్ళ కిందట ఫోన్ మోగితే  lift చేసి "హలో సార్ రమేష్ గారు, ఎలా ఉన్నారు ?" అన్నాను  "మౌనంగానే ఎదగమని...

Posts you may like